చిలకలూరిపేట: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితము.. వారు చేసిన కృషిని గురించి సంఘం...శరణం గచ్చామి. అనే నృత్య రూప నాటికను ఈనెల 30వ తేదిన నరసరావుపేటలోని గల ప్రకాష్ నగర్ నందు భువనచంద్ర టౌన్ హాలు లో ప్రజానాట్యమండలి పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శించ బడుతుందని వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు సాతులూరి లూతర్ అన్నారు.మంగళవారం స్థానిక పండరీ పురం రెండవ లైన్ లో గల కామ్రేడ్ ఏలూరు సిద్దయ్య విజ్ఞాన హాలులో దళిత,గిరిజన,ప్రజాసంఘా ల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ నాటకానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరణ చేశారు.. సాతులూరి లూథర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఈ బృహత్తర నృత్య నాటికను కె. దేవేంద్ర రచించారని శివప్రసాద్ ఈనాటికకు దర్శకత్వం వహిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే ఈ నాటికను సుమారుగా 600కు పైగా ప్రద ర్శనలుచేసి ప్రజా ఆదరణ పొందడం విశేషం అన్నారు. ఏపీ గిరిజన
సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బీ.శ్రీను నా యక్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అందరికీ సమానత్వంతో అమలు చేస్తున్నారని, అంబేద్కర్ అందరివారని, ఆయన ఆశయాల కనుగుణంగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈనాటిక ప్రదర్శనకు గిరిజన సంఘం తరఫునుంచి ఎక్కువమంది హాజరయ్యే విధంగా చూస్తానని తెలిపారు.. వి.సి.కె. పార్టీ నియోజకవర్గ కార్యదర్శి వి. ముత్తయ్య మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రస్తుత రోజుల్లో ఎంతైనా ఉందన్నారు. నరసరావుపేట లో జరుగు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను తనవంతుగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు ,ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ పేరుబోయిన వెంకటేశ్వర్లు, సిఐటియు విద్యుత్తు రంగం రాష్ట్ర అధ్యక్షులు జె. రాజశేఖర్, జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షులు బుచ్చిబాబు,నాయకులు టి.ప్రతాప్ రెడ్డి, జన క్రాంతి రాష్ట్ర అధ్యక్షులు షేక్ గౌస్, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు తదితర నాయకులు పాల్గొన్నారు..
0 comments:
Post a Comment