*కృషి వలుడికి పాత్రికేయులు గణ సత్కారం*
*తోట బ్రహ్మ స్వాములు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న చేతన్ న్యూస్ సీఈవో చెన్నకేశవుల రాంబాబు*
చిలకలూరిపేట పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం పక్కన గల ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్, పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్,పల్నాడు జిల్లా కార్యాలయంలో టిడిపి సీనియర్ నాయకులు శ్రీకృష్ణదేవరాయల కమిటీ మాజీ చైర్మన్, కాపు నాయకులు, మంచి మనిషి, సేవా తత్పురుడు తోట బ్రహ్మ స్వాములు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా పూలదండలతో శాలువాలతో ఏపీ ఎంఎఫ్ కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు. తదుపరి కేక్ కట్ చేసి తోట బ్రహ్మ స్వాములు కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎఫ్ జిల్లా అధ్యక్షులు న్యాయవాది చెల్లి దయా రత్నం, ప్రధాన కార్యదర్శి బి ఆర్ కే న్యూస్ రిపోర్టర్ న్యాయవాది ఇమ్మడి సురేంద్రబాబు, సంయుక్త కార్యదర్శి మొఖమాటం సురేష్ బాబు, టిడిపి లీగల్ సెల్ కార్యదర్శి సాప ఆదినారాయణ, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గుంటుపల్లి రవికుమార్, ఉపాధ్యక్షులు త్రిపురం సాయి, సంయుక్త కార్యదర్శి సింగిరేసి పోలయ్య, సభ్యులు విడదల మల్లి, తోట శేషాద్రి నాయుడు, బొల్లాపల్లి మనోహర్, వాసు, భాష న్యాయవాది, ఉదయగిరి కృష్ణ, జనసేన వీరమహిళ చెవిటి గంటి అమరేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment