728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Tuesday, July 16, 2024

అతి త్వరలో ఆటోనగర్ పూర్తి చేస్తాం




*ఆటోనగర్ పూర్తి చేసి చిలకలూరిపేటకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తాం: ప్రత్తిపాటి*

*ఏపీఐఐసీ అధికారులతో కలిసి ఆటోనగర్‌ను పరిశీలించిన ప్రత్తిపాటి*

*బుధవారం సాగర్ కుడి కాల్వ ద్వారా తాగునీటికి 5 టీఎంసీల విడుదల: ప్రత్తిపాటి*

*సోమ లేదా మంగళవారానికి చిలకలూరిపేట చెరువుకు సాగర్ జలాలు: ప్రత్తిపాటి*


చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన ఆటోనగర్‌ను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసి చిలకలూరిపేటకే ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. సకల సౌకర్యాలతో త్వరలోనే లబ్ధిదారులకు అక్కడ కేటాయించిన ప్లాట్లు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. చిలకలూరిపేట మండలం పోతవరం వద్ద ఆటోనగర్‌ను మంగళవారం ఆయన పరిశీలించారు. తెదేపా గత ప్రభుత్వం 2016లోనే ఈ ఆటోనగర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు చేపట్టామని, ఆటోమొబైల్స్ యూనిట్ల ఏర్పాటుకు ఏపీఐఐసీ 42.30 ఎకరాల భూమి కూడా కేటాయించిందన్నారు ప్రత్తిపాటి. నాడు రూ.50 కోట్లతో తొలిదశలో రహదారులు, విద్యుత్ స్తంభాలు, అంతర్గత మురుగు కాల్వలు పూర్తి చేసినా 2019లో ప్రభుత్వం మారడంతో ఆ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆటోనగర్ పనులు తిరిగి పట్టాలెక్కించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఏపీఐఐసీ డీజడ్‌ఎం జీవన్, ఇంజినీరింగ్ విభాగానికి చెందిన డీజడ్ఎం దొరబాబుతో చర్చించారాయన. ఆటోనగర్‌కు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. ఫేజ్-1, ఫేజ్‌-2లను కలిపి మధ్యలో ఉన్న భూముల రైతులు ముందుకొస్తే వాటిని కూడా అభివృద్ధి చేయాలని,  గత పాలకుల్లా ఎవరిపై ఒత్తిడి మాత్రం చేయమని ఈ సందర్భంగా ప్రత్తిపాటి తెలిపారు. నాడు తొలి దశ పనులతో పాటు లబ్ధిదారులను కూడా ఎంపిక చేశామన్నారు. కానీ తర్వాత ఈ ఆటోనగర్‌కే కాదు ఇంకొక ఆటోనగర్‌కు కూడా స్థలం ఇస్తామని చెప్పిన వైకాపా అవన్నీ మరిచిపోయి ప్రజల్ని మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం మారడంతో ఇంతకాలానికి ఆ గ్రహణం వీడిందన్నా రు. టాటా, మహీంద్రా కంపెనీల తరహా జీపులు తయారుచేసే శక్తి సామర్థ్యాలు ఉన్న కార్మికులు ఇక్కడ ఉన్నారన్నారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఆటోనగర్‌ను ఎందుకు నిర్లక్ష్యం చేశారో వారికే తెలియాల్ననారు. ఎంఎస్ఎంఈలో ఏమైతే ప్రయోజనాలు ఉన్నాయో వాటితో పాటు ఏపీఐఐసీ ద్వారా వచ్చే ప్రయోజనాలను తీసుకుంటామని వివరించారు. ఇక్కడి కార్మికుల్లో ఎక్కువమంది పేదలు, ముస్లిం మైనార్టీలు ఉన్నారన్నారు. వారందరికీ అనువుగా ఉంటే తప్ప ఇక్కడికి రారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లి ఎంతమేరకు వారికి రాయితీలు ఇప్పించాలో అంత ఇప్పిస్తామన్నారు. ఎంఎస్‌ఎంఈ  ద్వారా స్టేట్ జీఎస్టీ 9% ఐదేళ్లు ఉచితంగా ఇప్పిస్తామంటున్నారని తెలిపారు. ఐదేళ్లు రాయితీ ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు రాయితీ, అభివృద్ధి కూడా చేయాల్సి ఉందన్నారు. ఎంఎస్‌ఎంఈలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం వరకు రాయితీ వస్తుందన్నారు. 3 శాతం వడ్డీ రాయితీలు ఉన్నాయన్నారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ, ఏపీఐఐసీ, రాష్ట్ర ప్రభుత్వం అయితే 25 పైసలకే రుణాలు ఇప్పించే సౌకర్యం ఉందని ఏపీఐఐసీ అధికారులు చెప్పారన్నారు ప్రత్తిపాటి. విద్యుత్ ఛార్జీలను యూనిట్‌కు రూపాయి తగ్గించే సౌకర్యం కూడా ఉందని చెప్పారని, ఏది ఏమైనా రాయితీలు ఎక్కువ ఉంటే తప్ప ఈ ఆటోనగర్ ముందుకు వెళ్లే అవకాశం లేదన్నారు. ధర కూడా తగ్గించమని చెబుతున్నారన్నారు. గతంలో స్క్వేర్‌ మీటర్ రూ.1096 పెట్టారని, కానీ ఆ ధర ఎక్కువగా ఉందని చెబుతున్నారని, కాబట్టి వీటన్నింటిపై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడిన తర్వాత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి చిలకలూరిపేట ఆటోనగర్ ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఆయనకు వివరించి ఏవిధంగా రాయితీలు కల్పించాలో చర్చిస్తామన్నారు. ఈ ఆటోనగర్‌లో మొత్తం 42.30 ఎకరాల్లో 613 ప్లాట్‌లు ఉన్నాయన్నారు. 613 మంది కార్మికులకు ఇవ్వొచ్చని తెలిపారు. ఏదైనా పెద్ద షెడ్డు నిర్మాణం చేసుకోవాలంటే 2, 3ప్లాట్‌లు కూడా తీసుకోవచ్చన్నారు. దానికి అనుగుణంగా యూనియన్ బ్యాంకు కూడా సిద్ధంగా ఉందన్నారు. నెల రోజుల్లో దీనికి ఒక కార్యాచరణ, కార్యరూపం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. గతంలో కొందరు ప్లాట్‌ల కోసం డబ్బులు కట్టి వెనక్కి తీసుకున్నారని, ప్రస్తుతం వారి ఆలోచనలు ఏవిధంగా ఉన్నాయో పరిగణనలోకి తీసుకుంటాం అన్నారు. మొత్తం మీద ఆటోనగర్‌ ఏర్పాటుతో చిలకలూరిపేటను  ప్రత్యేక స్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. తాగునీటి అవసరాల దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే సాగర్ కుడి కాల్వ ద్వారా 5 టీఎంసీలను విడుదల చేయాలని ఆదేశించారని ప్రత్తిపాటి తెలిపారు. చిలకలూరిపేట చెరువులను పరిశీలించిన తర్వాత ఇదే విషయమై నిన్న జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కార్యదర్శి సాయిప్రసాద్‌తో మాట్లాడినట్లు చెప్పారు. బుధవారం సాగర్ కుడి కాల్వ ద్వారా నీటిని విడుదల చేస్తారని, సోమ లేదా మంగళవారానికి చిలకలూరిపేట చెరువుకు జలాలు చేరే అవకాశం ఉందన్నారు. దానికి తగిన విధంగా ఏర్పాట్లు కూడా చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించామన్నారు. నిన్న రాత్రి నుంచే పట్టణానికి నీటి సరఫరాను పెంచాలని సూచించామన్నారు.  గత పాలకుల తప్పిదాల వల్లనే నెల రోజులుగా పట్టణ ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. రాబోయే 15 రోజుల తర్వాత చిలకలూరిపేట మంచినీటి సమస్య కూడా పరిష్కారం కాబోతుందన్నారు.
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: అతి త్వరలో ఆటోనగర్ పూర్తి చేస్తాం Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews