728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Friday, August 2, 2024

అనధికార లేఔట్ లు వేసిన వారిపై కఠిన చర్యలు.. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు




*అనధికార లే అవుట్ లు వేసి ప్రజలను మోసం చేస్తే సహించను - శానిటేషన్, టిడ్కో గృహాలు, మంచి నీటి సరఫరా ప్రథమ ప్రాధాన్యాలు - ప్రత్తిపాటి పుల్లారావు*
                    పట్టణంలో ప్రజల మౌలిక సదుపాయల కల్పనే ప్రథమ ప్రాధాన్యాలుగా పెట్టుకున్నానని, వాటిని గాడిలో పెట్టే వరకూ అవిశ్రాంతంగా పని చేస్తాను, అధికారులతో పని చేయిస్తానని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం ఉదయం 22 వ వార్డు పరిధిలో హీరో హోండా షోరూం ఎదురుగా మంచి నీటి పైపు లైన్ లీకేజీ పనులను, రిజిస్టర్ ఆఫీసు ముందు ఉన్న సులభ కాంప్లెక్స్ ను సందర్శించడం జరిగింది.సులభ కాంప్లెక్స్ ద్వారా వచ్చే వ్యర్థాలను మురుగు నీటి కాల్వలోకి పెట్టకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం టిడ్కో గృహ సముదాయాన్ని సందర్శించి, మంచినీటి చెరువు వద్ద ఉన్న ఫిల్టర్ బెడ్ వ్యవస్థ పనితీరును పరిశీలించారు.అనంతరం గణపవరం మంచినీటి చెరువును పరిశీలించడం జరిగింది.ఈ సంధర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, టిడ్కో గృహాల లబ్దిదారులకు పలు సమస్యలు ఉన్నాయని, ఇళ్లు రిజిస్ట్రేషన్ జరిగి తాళాలు తీసుకొని నివాసం ఉండని ఇళ్లు వెనక్కు తీసుకోవడం జరుగుతుందని,నెల రోజుల వ్యవధిలో ప్రభుత్వం నుండి గృహాల లబ్దిదారులకు సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే నాన్ లే అవుట్ల పేరిట గత 5 సంవత్సరాలలో జరిగిన దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి ధృడమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. లే అవుట్ లు ద్వారా ఇక నుండి స్థిరాస్తి వ్యాపారులు వారి వ్యాపారం స్వేచ్చగా చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలకు కూడా లే అవుట్ లలో ప్లాట్లు కొంటే అనుమతులు కూడా వెంటనే వస్తాయని తెలిపారు.శానిటేషన్ ను మెరుగుపరచడానికి ప్రతి రోజూ అధికారులను, స్థానిక పార్టీ నేతలను ఉదయం 6 గంటల నుండి వార్డులలో తిరిగి సమస్యలను పరిష్కరించమని సూచించానని,15 రోజుల వ్యవధిలో కొంత మార్పు కనిపించిందని ప్రజలే చెబుతున్నారని తెలిపారు. మరింత  మెరుగైన శానిటేషన్ పట్టణ వాసులకు అందించి ప్రజారోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా సాగుతామని తెలిపారు.
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: అనధికార లేఔట్ లు వేసిన వారిపై కఠిన చర్యలు.. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews