*క్షేత్ర స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించేది సచివాలయాలే, మీ పని తీరుతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావాలి - ప్రత్తిపాటి పుల్లారావు*
క్షేత్ర స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించేది గ్రామ, వార్డు సచివాలయాలే అని మాజీ మంత్రి వర్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలియజేశారు. పట్టణ పరిధిలో 26,27,28,29 వార్డులకు సంబంధించిన 17,18,19,20 వ సంచివాలయాలను శనివారము ఉదయం ప్రత్తిపాటి పుల్లారావు ఆకస్మికంగా పరిశీలించారు. సచివాలయ సిబ్బంది వివరాలు, వారు అందించే సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సంధర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సచివాలయంలో ఉన్న సిబ్బంది అంకితభావంతో పని చేస్తే వార్డులలో సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలో శానిటేషన్, తాగు నీటి సరఫరా, స్ట్రీట్ లైటింగ్, దోమలు లేకుండా చర్యలు,ఆక్రమణల తొలగింపు, అనధికార లే అవుట్ ల నియంత్రణ వంటి పలు అంశాలను ప్రథమ ప్రాధామ్యాలుగా పెట్టుకుని ముందుకు వెళుతున్నామని,ఈ అంశాలు అన్నీ విజయవంతంగా అమలు చేయాలంటే మీ సచివాలయ ఉద్యోగులు మరింత మెరుగైన పనితీరును ప్రదర్శించాలని తెలిపారు.
0 comments:
Post a Comment