దద్దరిల్లిన పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ చిలకలూరిపేట సమావేశం
చిలకలూరిపేట పట్టణంలోని ఫైర్ ఆఫీస్ వద్ద అంకిరెడ్డి రమేష్ కార్యాలయంలో పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ చిలకలూరిపేట వారి నూతన కార్యవర్గసమావేశం నిర్వహించారు.
సమావేశంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షులు అనిల్, ఉపాధ్యక్షుడు నాగూర్ వలి, కార్యదర్శి సాహిద్, చిలకలూరిపేట సీనియర్ జర్నలిస్ట్ ఉద్యమాల వీరుడు ముఖ్యఅతిథిగా శీను నాయక్, పాల్గొని సమావేశంలోరాష్ట్ర కమిటీ వారు యూనియన్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా పోరాడాలి, విలేకర్ల ఇళ్ల స్థలాలు, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రైవేటు పాఠశాలల్లో విలేకర్ల పిల్లలకు రాయితీలు, ఇంకా రకరకాల సమస్యల మీద వివరించడం జరిగింది.
పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ చిలకలూరిపేట అధ్యక్షులు చెన్నకేశవుల రాంబాబు, గౌరవ అధ్యక్షులు అంకిరెడ్డి రమేష్, రఫీ,గౌరవ సలహాదారులు మల్లెల శివ నాగేశ్వరావు, ఉండవల్లి అనిల్, ఉపాధ్యక్షుడు చప్పిడి బాలస్వామి, కోశాధికారి దండావత్ గోపి నాయక్, కార్యదర్శి బాలకృష్ణ,చంద్ర, జీవన్ ప్రకాష్, గంగిశెట్టి రమణ, గుంటుపల్లి ఆదిబాబు, తదితరులు పాల్గొని చిలకలూరిపేట లోని విలేకరుల సమస్యల మీద చర్చించడం జరిగినది,
రాష్ట్ర కమిటీ వారు పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ చిలకలూరిపేట సభ్యులు శాలువాలతోటి, పూలదండలతోటి సత్కరించి అభినందనలు తెలియజేశారు.
0 comments:
Post a Comment