చిలకలూరిపేట:ఈ నియోజకవర్గ రేషన్ మాఫియా కు "నేనే రాజు----నేనే మంత్రి" అంటున్న రేషన్ మాఫియా చీకటి వీరుడు. అంతా నా కనుసైగల్లో, నా ఇష్టంతో జరగాలని శాసనం చేస్తాడు. కొడితే కొట్టించుకోవాలంటాడు. తిడితే తిట్టిచ్చుకోవాలంటాడు. ఏ స్థాయి
అధికారుల నైనా తన కనుసైగల లో ఉండాలని హుకుం జారీ చేస్తాడు.
సమాజంలో విలువలు కోల్పోయి బ్రతుకుతెరువు నిమిత్తం రేషన్ వ్యాపారం చేస్తున్న వారి వద్ద నుండి సరుకు తీసుకొని డబ్బులు అడిగితే ఏదో ఒక కేసులో ఇరికించగల ఘనాపాటి. ప్రభుత్వ అధికారుల తో పాటు, వారి కార్యాలయాలలో నిర్భయంగా పగలు, రాత్రి లేకుండా మద్యం ఏరులై పారించగలడు. ప్రభుత్వ కార్యాలయాన్ని సారా దుకాణంగా బోర్టు మార్చగల సాహసవంతుడు. భయపెట్టడం, బెదిరించటం, కొట్టటం, తిట్టటం, తీసుకున్నసరుకు తాలూకా డబ్బులు ఇవ్వకపోవడం, డబ్బులు అడిగిన వారిపై కేసులు కట్టించటం, అధికారులనూసైతం రాజకీయ అండదండలు ఉన్నాయి అని బెదిరించటం, సహా వ్యాపారస్తులను అధికారులకు పట్టించి కేసులు పెట్టడం సదరు నాదెంళ్ళ మండలం గణపవరం గ్రామానికి చెందిన రేషన్ మాఫియాదొరగారికున్న అదనపు వ్యాపార అర్హతలు.
సదరు దొరగారు రాత్రి ఉదయించే సూర్యుడు, చీకటి సామ్రాజ్యానికి రారాజు, రాత్రులు విధులు నిర్వహించే ఉద్యోగులను మద్యం మత్తులో జోలపాడి నిద్రపుచ్చగలడు. మద్యం మత్తులో జోగనివారికి ప్రత్యేక బహుమతులు ఇచ్చి ఆకర్షించగల సమర్థుడు. వ్యాపార వ్యవహార నిర్వహణకు పెద్ద మొత్తంలో నెల మామూలు చెల్లిస్తున్నామని అడిగిన వారి కల్లా తెలియచేసే ప్రచార పులి. ఇతనే కాదుఇతని స్నేహితులు కూడా ఇదే పందాలో వ్యాపార వ్యవహారాలు నిర్వహించటం నియోజకవర్గ ప్రజలు గమనించదగిన విషయం. నీతి, నిజాయితీ, నిబద్ధతకు నిలువుటద్ధమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
కి అత్యంత సన్నిహితుడైన
నాదెండ్లమనోహర్ బాధ్యత వ్యవహరిస్తున్న శాఖ లోనే ఇలాంటి అవకతకాలు జరగటం బాధాకరం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టేందుకు రాత్రి, పగలు తేడా తెలియకుండా కృషిచేసిన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి చేయడం బాధాకరమని ఇలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోక పోతే సంబంధిత శాఖ మంత్రిని, ఉన్నతాధికారులను, కలసి ఫిర్యాదు చేసేందుకు వెనకాడ బోమని కాపు నాయకులు హెచ్చరించారు.
0 comments:
Post a Comment