శ్రీవారి లడ్డు ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి నిరసనగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష ప్రేరణ లో భాగంగా చిలకలూరిపేట నియోజకవర్గం ,బోప్పిడి కొండపై వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్.
సోమవారం ఉదయం బోప్పిడి కొండపై గల వెంకటేశ్వర స్వామి దేవాలయంకు మెట్ల పూజ చేసుకొని దేవాలయాoను శుద్ధిచేసి, 101 ప్రమిదలతోటి దీపారాధన చేసి, స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ
శ్రీవారి పాదాలతో పునీతమైన పవిత్ర లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసిన ఘనత గత వైసిపి సర్కార్ దే అని అన్నారు.
జగన్ సర్కార్ చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని అన్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగాను, ప్రపంచవ్యాప్తంగాను కోట్లాదిమంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని లడ్డు ప్రసాదాన్ని స్వీకరిస్తారని.. అలా స్వీకరించడం దైవానుగ్రహంగా భావించి ఏడేడు జన్మల పాపాలు పోతాయని హిందువులు భావిస్తారన్నారు. అటువంటి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేయడం ద్వారా హిందువుల అందరి మనోభావాలను గత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా గాయపరిచిందని విమర్శించారు. జంతు అవశేషాలతో, భయంకరమైన రసాయనాలతో కూడిన లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేయడం అంటే దేవతలను అపవిత్రం చేయడమేనని.. హిందూ మతాన్ని దారుణంగా కించపరచడమేనని అన్నారు.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని విచారణకు ఆదేశించిందని తెలిపారు. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడేందుకు.. అక్కడ పరిస్థితులను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి వెంటనే రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల సారధ్యంలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అంబటి సోంబాబు గారు, గుంటుకోటి, చిన్నంశెట్టి పద్మ, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పఠాన్ ఖాదర్ బాషా , పట్టణ అధ్యక్షులు మునీర్ హసన్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు అచ్చుకొల బ్రహ్మ స్వాములు, కూరపాటి శివశంకర్, బోప్పిడి గ్రామ నాయకులు అంకారవు, గోపి, సాంబ, సూర్య మరియు జనసేన పార్టీ వీర మహిళలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
.
.
0 comments:
Post a Comment