అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి కార్మికుల పక్షాన ఎందుకు మాట్లాడడం లేదు.బి.శ్రీను నాయక్.
విశాఖ ఉక్కు పరిరక్షణకై యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించడం జరిగింది . నరసరావుపేటలోని గాంధీ పార్క్ నందు యువజన, విద్యార్థి సంఘాల నాయకులు దీక్ష లోపాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో యువజన , విద్యార్థి సంఘాల నాయకులకు మద్దతు గా (ఏఐవైఎఫ్) అఖిల భారత యువజన సమైఖ్యా చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ బి. శ్రీను నాయక్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం 1325 రోజులుగా పోరాటం జరుగుతుందని, ఆంధ్రుల ఆత్మగౌరానికి ప్రతీకగావున్న విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం వైఖరిలో ఏమాత్రం మార్పు లేదని మండిపడ్డారు. కేంద్ర స్టీల్ మంత్రిత్వ శాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరు, మంత్రి మాట్లాడుతున్న తీరు, రాజకీయ నాయకుల ప్రకటనలు చూస్తుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పై పెద్ద కుట్ర కుట్ర జరుగుతుందని ఆగ్రహ వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి దీనిపైన నోరు మెదపకపోవడం చూస్తా ఉంటే కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. విద్యార్థి, యువజన, కార్మికుల బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పై పోరాటం చేయకపోతే చేజారిపోయే అవకాశం ఉందన్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ పై కుట్రలు మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్, కార్మిక సంఘాల నాయకులు శిలార్, శివ కుమారి, మల్లీశ్వరి, ఆంజనేయులు నాయక్, కాస రాంబాబు , రంగయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన , విద్యార్థి సంఘాల నాయకులు ఆంజనేయ రాజు, రాజ్ కుమార్, సాయి కుమార్, అమూల్య, శ్రీనివాస్, పుట్టా వెంకట బుల్లోడు, బి.రాంబాబు నాయక్ ,బి. వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment