చిలకలూరిపేట పట్టణానికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి..*
మాదాసు భానుప్రసాద్, ప్రజా మేనిఫెస్టో కన్వీనర్ మరియు లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్..
చిలకలూరిపేట నియోజకవర్గంలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని నిన్న రాత్రి బొప్పూడి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుదు దుర్మరణం పాలయ్యాడని అన్నారు. న మొన్న మధ్యాహ్నం కావూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళుతూ కారు ఢీకొనడం వల్ల చనిపోయాడని అన్నారు.
అదేవిధంగా, నరసరావుపేట సెంటర్లో విద్యార్థులు కాలేజీలకు వెళ్లే సమయంలో
ఆటోలు, ఆర్టీసీ బస్సులు, కాలేజీ బస్సులు అడ్డంగా పెట్టడం వల్ల అనేక ఇబ్బందులకు గురి అవుతున్నామని విద్యార్థులు తన దృష్టికి తీసుకువస్తున్నారని భాను ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, సిగ్నల్ లైట్లను వెంటనే ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించి గత ప్రభుత్వంలోనే గౌరవ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యేక నిధులు విడుదల చేస్తానని చెప్పిన అప్పటి అధికారులు సాంకేతిక కారణాలతో దానిని పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. చిలకలూరిపేట పరిసర ప్రాంతాలలో గత ఐదు సంవత్సరాలలో 200 మంది పైగా రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయారని అన్నారు. వివిధ రంగాలలో సక్సెస్ సాధించిన వారికి ఫ్లెక్సీలు కట్టుకుంటూ పోతే, కట్టే వారి జీవితాల్లో సక్సెస్ రాదు అని విషయాన్నీ గుర్తించాలని అన్నారు. ఫ్లెక్సీలు రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని భాను ప్రసాద్ డిమాండ్ చేశారు..
0 comments:
Post a Comment