ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ద్వారా భక్త జనకోటి మనోభావాలను దెబ్బ తీసింది గత ప్రభుత్వ అని వారి హయాంలో ఏర్పాటైన పాలక మండలి వ్యవహార శైలి, లడ్డూ కల్తీ ద్వారా చేసిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు అని అన్నారు.పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, యజ్ఞ యాగాలు, మంత్ర పఠనంలు నిర్వహిస్తున్నారని అన్నారు. శ్రీవారి లడ్డు విషయంలో జరిగిన అపచారానికి ఎవరైతే కారకులయ్యారో వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వార్డు ప్రజలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ,వీర మహిళలు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment