పేరు పిచ్చితో గతప్రభుత్వంలోని అవినీతి మంత్రి 8వార్డులు, 30గ్రామాలకు తాగునీరు లేకుండా చేశారు : మాజీమంత్రి ప్రత్తిపాటి
- టీడీపీ ప్రభుత్వంలో అన్ని అనుమతులతో ప్రారంభమైన ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ ను గత ప్రభుత్వం అన్యాయంగా మూసేసింది. : ప్రత్తిపాటి
- టీడీపీకి, చంద్రబాబుకి పేరు వస్తుందన్న దురుద్దేశంతోనే గత ప్రభుత్వం ప్రజలకు తాగునీరు లేకుండా చేసింది : ప్రత్తిపాటి
- గతంలోనే ప్లాంట్ ప్రారంభానికి ప్రయత్నిస్తే, టీడీపీ నాయకులపై అట్రాసిటీ కేసులు పెట్టించి వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది : పుల్లారావు
- ఉగాదినాడు కాంటినెంటల్ కాపీ, వరప్రసాద్ ల నిధులతో ప్లాంట్ పున: ప్రారంభించడం సంతోషంగా ఉంది : పుల్లారావు
30 గ్రామాలకు తాగునీరు అందించే తాగునీటి పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, టీడీపీ హాయాంలో సీ.ఎస్.ఆర్ నిధులతో రూ.4కోట్లతో ప్రారంభించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని అవినీతి మంత్రి నిరుపయోగంగా మార్చారని, ఆ పథకాన్ని ఉగాదినాడు పున: ప్రారంభించడం సంతోషంగా ఉందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆనాడు తాగునీటి పథకం ప్రారంభానికి ముఖ్యమంత్రి సతీమణి, శ్రీమతి భువనేశ్వరి ఎంతో చొరవ చూపారన్నారు.
ఆదివారం ఆయన పట్టణ శివారులో మంచినీటి చెరువు పక్కన ఉన్న తాగునీటి ప్లాంట్ ను పున:ప్రారంభించిన అనంతరం ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడారు.
తాగునీటి పథకానికి అన్ని అనుమతులు ఉన్నా గత ప్రభుత్వం కేవలం టీడీపీకి పేరు వస్తుందన్న దురుద్దేశంతోనే ప్లాంట్ ను నిలిపివేసిందని ప్రత్తిపాటి తెలిపారు. గతప్రభుత్వంలోనే పాడైపోయిన బోర్ల స్థానంలో రూ.20లక్షలతో కొత్తవి ఏర్పాటుచేసి పథకం ప్రారంభించడానికి ప్రయత్నిస్తే, టీడీపీ ముఖ్య నాయకులపై తప్పుడు అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారని ప్రత్తిపాటి తెలిపారు. 5 ఏళ్ల పాటు తాగునీటి ప్లాంట్ మూసివేసి, పట్టణంలోని 8 వార్డులు, 30 గ్రామాలకు తాగునీరు లేకుండా చేసిన పాపం గత ప్రభుత్వానిదేనని మాజీమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి పథకానికి తమపార్టీ పేరు, నాయకుడి పేరు పెట్టి నడుపుకోవచ్చని గతంలో అవినీతి మంత్రి చెప్పడం జరిగిందన్నారు. ఎవరో ప్రారంభించిన పథకాలకు వారి పేర్లు పెట్టుకోవడానికి వారికి సిగ్గుకూడా లేదన్నారు.
కాంటినెంటల్ కాఫీ, వరప్రసాద్ ఇచ్చిన రూ.25లక్షలతో పున: ప్రారంభించాం..
కాంటినెంటల్ కాఫీ రూ.15లక్షలు, కే.ఎమ్.ఈ. వరప్రసాద్ రూ.10లక్షల సీ.ఎస్.ఆర్ నిధులతో తాగునీటి పథకాన్ని పున: ప్రారంభించడం జరిగిందని పుల్లారావు చెప్పారు. పల్నాడుజిల్లాలో మరెక్కడా ఇటువంటి భారీ తాగునీటి ప్లాంట్ లేదన్నారు. ప్లాంట్ నిర్వాహకులు లాభాపేక్ష లేకుండా కేవలం సిబ్బంది జీత భత్యాలకు, విద్యుత్ బిల్లులు చెల్లించడానికి వినియోగదారుల నుంచి నామమాత్రంగా 20లీటర్లకు రూ.5లు తీసుకుంటున్నారని పుల్లారావు చెప్పారు.
0 comments:
Post a Comment