హెచ్.ఐ.వీ వ్యాధిగ్రస్తులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మాజీమంత్రి ప్రత్తిపాటి
పట్టణంలోని 35వ వార్డు సాంబశివనగర్ లో హెచ్.ఐ.వీ వ్యాధిగ్రస్తులకు మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
స్వచ్ఛంద సేవా సంస్థ క్రిస్టియన్ అసోసియేషన్ ఫర్ మెడికల్ మిషన్ అండ్ పీపుల్స్ డెవలప్ మెంట్ (CAMP) ఏర్పాటుచేసిన సేవా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రత్తిపాటి. హెచ్.ఐ.వీ వ్యాధిగ్రస్తులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ పథకాలు వారికి అందుతున్నాయో లేదా అని అడిగిన ప్రత్తిపాటి, ఎయిడ్స్ బాధితులకు ప్రభుత్వం పింఛన్ , ఉచిత మందులు, ఉచిత వైద్యసేవల్ని అందిస్తోందన్నారు. వ్యాధిగ్రస్తుల ఆరోగ్య రక్షణకు కేంద్రప్రభుత్వం కూడా కృషి చేస్తోందన్నారు. హెచ్.ఐ.వీపై ఆందోళనతో కలత చెందవద్దని ప్రత్తిపాటి వారికి ధైర్యం చెప్పారు. వ్యాధిగ్రస్తులకు నిత్యావసరాల పంపిణీకి ముందుకొచ్చిన ఎన్.జీ.వో సంస్థ CAMP నిర్వాహకుల్ని ప్రత్తిపాటి ప్రత్యేకంగా అభినందించారు.
0 comments:
Post a Comment