యన్.టి.ఆర్.సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ పునః ప్రారంభించిన - ప్రత్తిపాటి
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని మంచి నీటి చెరువుల వద్ద గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన యన్.టి.ఆర్. సృజల స్రవంతి వాటర్ ప్లాంట్ ను గత వైకాపా ప్రభుత్వం మూసివేయటంతో దానిని నేడు మాజీమంత్రి, శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు తిరిగి పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీ రామారావు తనయురాలు నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో దీనిని సుమారు నాలుగు కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇవి మొత్తం రాష్ట్రంలోనే నాలుగు ఉన్నాయని వాటిలో ఒకటి మన పల్నాడు జిల్లాలో ఉండటం గర్వకారణం అని అన్నారు. ఈ ప్లాంట్ ద్వారా చిలకలూరిపేట పట్టణ మరియు పరిసర గ్రామాల్లో 30 అవుట్ లెట్ ల ద్వారా రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించడం జరిగిందని అన్నారు. అయితే గత వైకాపా ప్రభుత్వంలో ఇక్కడి అవినీతి మంత్రి ఈ ప్లాంట్ కి చెరువు నుండి నీరు ఇవ్వకపోగా, కనీసం బోర్లు వేసుకోవటానికి కూడా అనుమతి ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment