అమరావతి పేరు ప్రపంచమంతా వినిపించేలా, దేశం గర్వించేలా మోదీ సభను విజయవంతం చేద్దాం : మాజీమంత్రి
- 2న అమరావతిలో జరిగే ప్రధాని బహిరంగ సభ విజయవంతంపై పార్టీ శ్రేణులకు ప్రత్తిపాటి దిశానిర్దేశం
- కూటమినాయకులు, టీడీపీ శ్రేణులు చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా అమరావతి పునర్నిర్మాణ వేడుకను విజయవంతం చేయాలి. : ప్రత్తిపాటి
- రాజధాని నిర్మాణంతో రాష్ట్రానికి పరిశ్రమలు.. పెట్టుబడులు వచ్చి భూముల ధరలు పెరిగి ప్రజల జీవనచిత్రమే మారిపోతుంది : కావ్య కృష్ణారెడ్డి
మే 2న అమరావతిలో జరిగే ప్రధాని మోదీ బహిరంగసభ విజయవంతానికి కూటమిపార్టీల నేతలంతా కలిసికట్టుగా కృషిచేయాలని, దేశమంతా గర్వించేలా సభానిర్వహణ చేపట్టిన కూటమి ప్రభుత్వ కీర్తిప్రతిష్టలు ఇనుమడించేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన మోదీ సభానిర్వహణ నియోజకవర్గ ఇన్ ఛార్జ్, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డితో కలిసి కూటమిపార్టీల నాయకులు, గ్రామ, మండల, నియోజకవర్గంలోని టీడీపీ ప్రధాన నాయకులతో మోదీ బహిరంగ సభ విజయవంతానికి అనుసరించాల్సిన విధివిధానాలపై సమగ్రంగా చర్చించారు. మోదీచేతుల మీదుగా జరిగే ప్రజారాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు అనుకున్న లక్ష్యం ప్రకారం పూర్తైతే, ప్రపంచం గర్వించే రాజధానిని ప్రజలంతా చూస్తారని ప్రత్తిపాటి తెలిపారు. లక్షకోట్లపనుల్ని సకాలంలో పూర్తిచేయాలన్నదే కూటమిప్రభుత్వ లక్ష్యమన్నారు. అమరావతి ఫలాలు పేదవర్గాలకు అంది వారు సంతోషంగా జీవించేలా చేయాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అని ప్రత్తిపాటి చెప్పారు. ఆ దిశగా కూటమిపార్టీల శ్రేణులు రాజధాని నిర్మాణం గురించి ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. వైసీపీ అమరావతిపై విద్వేషం చిమ్మడం ఆపలేదని, ఇప్పటికీ సోషల్ మీడియాలో చిన్నచిన్న ఘటనలను భూతద్దంలో చూపుతూ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటుతోందని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని, సోషల్ మీడియాలోచురుకైన పాత్ర పోషించాలని ప్రత్తిపాటి సూచించారు. దేశంలో మరే రాష్ట్రం అందించని విధంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు సామాజిక పింఛన్లు అందిస్తోందన్నారు. ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో నెలకు రూ.500లు మాత్రమే ఇస్తున్నారని, ఏపీ ప్రభుత్వం రూ.4వేలు ఇవ్వడం సామాన్యవిషయం కాదన్నారు. రాజధాని నిర్మాణంతో పాటు, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమానఅభివృద్ధే ధ్యేయంగా కూటమిప్రభుత్వం కేంద్ర సహకారంతో ముందుకు వెళుతోందన్నారు. త్వరలోనే రాయలసీమ, ఉత్తరాంధ్రలో ప్రభుత్వం భారీ ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధమవుతోందన్నారు. జూన్ లో కర్నూల్లో మరో గొప్ప కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించనుందన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ప్రత్తిపాటి చెప్పారు.
*11 నెలల్లో జగన్ విధ్వంసం నుంచి కూటమిప్రభుత్వం రాష్ట్రాన్ని గట్టెక్కించింది..*
గత ప్రభుత్వం రెవెన్యూశాఖలో చేసిన అక్రమాలు, తప్పులు సరిదిద్దడం పెద్ద ప్రహాసనంగా మారిందని, వీలైనంతవరకు అధికభాగం సమస్యల్ని కూటమిప్రభుత్వం పరిష్కరించిందన్నారు. భూసమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యాన్ని కూడా ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందన్నారు. 11 నెలల్లో జగన్ చేసిన విధ్వంసపాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి, ప్రజలకు సంతోషకరమైన సంక్షేమం అందించడం నిజంగా చాలా గొప్ప విషయమని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. మన ప్రభుత్వం చేస్తున్న, చేయబోతున్న పనుల గురించి అందరం గర్వంగా చెప్పుకోవాలన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుచేయకుంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారన్నారు. ఇప్పటికీ చిలకలూరిపేట నియోజకవర్గంలో విడదల రజనీ చేసిన భూదందాలు, ఆక్రమణలపై ఇప్పటికీ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇంకా చాలామంది బయటకు రావడానికి సందేహిస్తున్నారన్నారు.
*ప్రధాని సభ విజయవంతాన్ని చిలకలూరిపేట ప్రజలు బాధ్యతగా భావించాలి : కృష్ణారెడ్డి*
రాక్షసపాలన పోయి రాష్ట్రంలో రాముడి వంటి చంద్రబాబు పాలన ప్రారంభంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, అమరావతిలో జరిగే ప్రధాని మోదీసభను విజయవంతం చేయడం చిలకలూరిపేట ప్రజలు తమబాధ్యతగా భావించాలని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సూచించారు. ప్రత్తిపాటి పుల్లారావు వంటి అనుభవజ్ఞుడి నాయకత్వంలో చిలకలూరిపేట సమగ్రాభివృద్ధి చెందుతోందన్నారు. నియోజకవర్గంలోని 8వేలమంది కే.ఎస్.ఎస్ (కుటుంబ సాధికార సారథులు) బీజేపీ, జనసేన కార్యకర్తలు నిబద్ధతతో పనిచేస్తే ప్రధాని సభ విజయవంతంలో నియోజకవర్గం కీలకపాత్ర పోషిస్తుందని కృష్ణారెడ్డి చెప్పారు. చంద్రబాబు నాయుడి జీవితం తెరిచిన పుస్తకమని, ఆయన చల్లనిదీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. రాజధాని నిర్మాణమనేది మనకోసం.. మన బిడ్డల భవిష్యత్ కోసమనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని కృష్ణారెడ్డి తెలిపారు. రాజధాని పూర్తైతే, పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చి భూములధరలు పెరిగి ప్రజల జీవనచిత్రమే మారిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి తోట రాజారమేష్, బీజేపీ నాయకులు జయరామిరెడ్డి, టీడీపీ నాయకులు దారు నాయక్, టీడీపీ కరీముల్లా, ఇనగంటి జగదీష్, నెల్లూరి సదాశివరావు, పఠాన్ సమాధ్ ఖాన్, జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, వీర రెడ్డి, మద్దుమలా రవి, క్లస్టర్ లు, యూనిట్ ఇంచార్జిలు , నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment