శ్రీదత్త సాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం--, చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గురువారం పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు అర్చన కార్యక్రమాలు జరిగినాయి, అనంతరం భక్తులకు దాతల సహకారంతో అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది, ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ గత 14 సంవత్సరములుగా దాతల సహకారంతో చిలకలూరిపేట పట్టణ ప్రజల సహాయ సహకారాలతో ప్రతి గురువారం నిర్విరామంగా అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుందని, ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టాలయ్యా అనే షిరిడి సాయినాధుని సూక్తిని ఆధారంగా చేసుకుని దత్త సాయి సన్నిధిలో గురువారం వచ్చే ప్రతి ఒక్కరికి అన్న సంతర్పణ చేస్తున్నామని, షిరిడి సాయినాధుని ఆశీస్సులతో అన్నదాన కార్యక్రమమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నామని, నీటిలో భాగంగా అనేక సేవా పురస్కారాలు కూడా ట్రస్ట్ కు వచ్చాయని తెలియజేశారు దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు మీ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరు హనుమంతరావు అయినవోలు హనుమంతరావు తదితర భక్తులు పాల్గొన్నారు
0 comments:
Post a Comment