అమ్ములు ఫ్యాషన్ సౌజన్యంతో మహిళా కార్మికులకు వస్త్ర బహుకరణ.
చిలకలూరిపేట: ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో గల ఏలూరు సిద్దయ్య విజ్ఞాన కేంద్ర మందిరంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం మేడే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ చికాగో నగరంలో హే మార్కెట్ లో రక్తం చిందించిన రోజు, 8 గంటల పని దినంగా గుర్తింపు పొందిన రోజు మేడేగా మనం చేసుకుంటున్నామని 1886 లో 8 గంటల పనిదినం కోసం కార్మికవర్గం పోరాడి 139 సంవత్సరాలు గడిచాయని, ఈ కాలంలో శాస్త్ర, సాంకేతికరంగాలు ఎంతో పురోగతి సాధించి అత్యంత ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. దీని ఫలితంగా కార్మికులకు పనిగంటలు తగ్గాల్సి వుండగా దోపిడీవర్గాలు పనిగంటలను పెంచుతున్నాయని, స్వదేశీ, విదేశీ బడా కార్పొరేట్లకు వత్తాసు పలుకుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అందుకు అనుమతిస్తూ 4 లేబర్ కోడ్ లను తెచ్చిందన్నారు. ఉత్పాదకరంగంలోని పరిశ్రమలలోనే కాక సాఫ్ట్ వేర్ రంగంలోని మేధో ఉద్యోగుల పనిగంటలు పెంచడం, పని తీవ్రత పెంచడం ద్వారా కార్పొరేట్లు సూపర్ లాభాలను అర్జిస్తున్నారని తెలిపారు.
1947తో పోలిస్తే ఈనాడు విదేశాలకు మన సంపద కొన్ని వందల రెట్లు తరలిపోతోందని ప్రజలపై ఏకీకృత పన్నుగా జిఎస్టీని రూపొందించి సగటు మనిషిని పన్నుల భారంతో నడ్డివిరగదీస్తున్నారని జిఎస్టీ ఫలితంగా చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు అనేకం మూసివేతకు గురై లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయారని అన్నారు.అనంతరం
అమ్ములు ఫ్యాషన్ నిర్వాహకులు పాశం సురేష్, సౌజన్యంతో
మాలెంపాటి గోపీనాథ్,
మాలెంపాటి అలేఖ్య చేతుల మీదగా పారిశుద్ధ్య మహిళా కార్మికులకు నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులకు ప్రత్యేకంగా మేడే శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో
సిఐటియు నాయకులు పేరుబోయిన వెంకటేశ్వర్లు,బి.శ్రీను నాయక్ కౌన్సిలర్ వి. కోటా నాయక్, పాలపర్తి శ్రీనివాసరావు,బి. చిన్న నాయక్, కొండ్రముట్ల నాగేశ్వరరావు, తుర్లపాటి వెంకట నగేష్, చెన్నకేశవుల రాంబాబు,పుట్టా వెంకట బుల్లోడు, సలికినీడి నాగరాజు, యం.వెంకటేష్ నాయక్, కంచర్ల శ్రీనివాసరావు బి.రాం బాబు నాయక్,తోపాటు రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment