హౌస్ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు - రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం: టిడిపి నేతలు
అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా అక్రమ అరెస్టులను నిరసిస్తూ, గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం, అమరావతి జేఏసీ పిలుపు మేరకు “చలో గుంటూర్ జైలు భరో” కార్యక్రమానికి బయలుదేరిన మాజీమంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని పట్టణ పోలీసులు హౌస్ అరెస్ట్ చెయ్యడం జరిగింది. ఈ అక్రమ అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రత్తిపాటి స్వగృహం నందు నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా పార్టీ నేతలు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా? అని అనుమానం కలిగే విధంగా వైసీపీ పాలన సాగుతోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో అన్యాయాన్ని ఖండించే నాయకుల్ని ఇన్ని సార్లు హౌస్ అరెస్టులు చెయ్యడం వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాతే జరుగుతోందని, రైతుల చేతులకు బేడీలు (సంకెళ్ళు) వేసే అంత తప్పు వాళ్ళు ఏం చేశారని, రైతుల ఉసురు రాష్ట్రానికి మంచిది కాదని, ఇప్పటికైనా మీ మొండి వైఖరి మానుకొని అమరావతినే రాజధానిగా కొనసాగించి రాష్ట్ర భవిష్యత్తు కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ కరిముల్లా, బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజి మదన్ మోహన్, ఇనగంటి జగదీష్, మిరియాల రత్న కుమారి, జరీనా సుల్తానా, అంబటి సోంబాబు, గుర్రం నాగ పూర్ణచంద్రరావు, కొప్పుల లాజర్, షేక్ అజారుద్దీన్, షేక్ జాకీర్, లోక బ్రహ్మయ్య, దివ్వె కోటేశ్వరరావు, సలిశo శ్రీనివాస్ రావు, రావిపాటి కోటేశ్వర రావు, వెంకట్రావు, మచ్చా వెంకటేశ్వర్లు, తోండేపి వెంకయ్య, జవ్వాజి బుచ్చిబాబు, బొంతా వేణు, తిమ్మిశెట్టి శ్రీను, షేక్ బషీర్, అమరా మణి, తాళ్లూరి భార్గవ్, షేక్ రఫీ, G.C.కరిముల్లా, షేక్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment