బడుగు,బలహీన వర్గాలు ఆర్ధికంగా,సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందేందుకు ఉద్యమించిన మహాత్మా జ్యోతిరావు పూలే
ఆయన ఆశయాలను అమలు చేసి చూపించిన ఎన్టీఆర్
--డా||చదలవాడ అరవింద బాబు
మహాత్మా జ్యోతిరావు పూలే గారి 130 వ వర్ధంతి సందర్భంగా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యలయములో ఆయన చిత్రపటానికి నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి డా||చదలవాడ అరవింద బాబు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డా||చదలవాడ మాట్లాడుతూ కులం పేరుతో తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న బడుగు,బలహీన వర్గాల కోసం, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు.చదువు అందరికీ ఎంతో అవసరమని గుర్తించి పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి బాటలు వేసిన మొదటి వ్యక్తి.వితంతువులు వివాహాలు ప్రోత్సహించి సమాజంలో మహిళలలు విద్యావంతులు కావలసిన అవసరాన్ని గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేసి వారికి విద్యానందించేందుకు శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి పూలే గారు.లింగ వివక్ష,జాతి వివక్ష లేని సమసమాజ స్థాపనకు తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి పూలే గారు.జాతిపిత మహాత్మా గాంధీ కంటే ముందు మహాత్మా బిరుదునుపొంది, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ గారిచే గురువుగా పిలవబడినాడంటే జ్యోతిరావు పూలే గారి గొప్పతనం ఏమిటో అర్ధమవుతుంది బడుగు,బలహీన వర్గాలు ఆర్ధికంగా,సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందలనే పూలే ఆశయాన్ని అమలు చేసి చూపించిన మొదటి వ్యకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని,దేశములోని మొదటిసారి బీసీ లకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించి పూలే గారి ఆశయాలను ఆంద్రప్రదేశ్ లో అమలు చేసి చూపించారు.తెలుగుదేశం హయాంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయములో బీసీ ల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టడము తో పాటు బీసీ లకు ఉన్నత పదవులు ఇచ్చి పూలే గారి ఆశయాలను అమలు చేసి చూపించారు.మహాత్మా జ్యోతిరావు పూలే 130 వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయ్ శ్రి,లీగల్ సెల్ అధ్యక్షులు చెన్నుపాటి నాగేశ్వరరావు,వల్లెపు నాగేశ్వరరావు,కొట్ట కిరణ్, ఇమ్మడిశెట్టి కాశయ్య, మాన్నన్ షరీఫ్,గొట్టిపాటి జనార్ధన్ బాబు,కొల్లి బ్రహ్మయ్య,పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్,పాపారావు,మాజీ కౌన్సిలర్స్ కొలిపాక చంద్రశేఖర్, నాగజ్యోతి,సైదమ్మ, మాబూ,భాష,సుభని, మస్తాన్,బంగారం,బాజీ,నాగుర్, విరప్పయ్య,ఖాసీం,రమణ మూర్తి, శ్రీను, నారాయణ,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment