ఫూలే ఆశయాల్ని కొనసాగించటమే లక్ష్యం... నల్లపు కోటి
✳️దళిత చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా ఫూలే వర్ధంతి✳️
దళిత చైతన్య స్రవంతి, చిలకలూరిపేట వారి ఆధ్వర్యంలో సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 130 వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత చైతన్య స్రవంతి అధ్యక్షుడు నల్లపు కోటేశ్వరరావు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫూలే వెలిగించిన సామాజిక విప్లవ దివిటీ ని ఆర్పకుండా ముందుకు తీసుకెళ్లటమే తమ లక్ష్యమని, స్త్రీ విద్య కి పునాది ఫూలే అని, రాజాకీయాల్లో ఫూలే వారసులు గా చెప్పుకుంటున్న నాయకులు సలాం గిరి, గులాం గిరి వదిలేసి అన్ని వర్గాలకు సామాజిక న్యాయమే లక్ష్యం గా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత చైతన్య స్రవంతి సభ్యులు యడ్ల వినీల్, బత్తుల విక్రమ్, అన్నలదాసీ బుల్లి, కుడారి సోను, మాలమహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు యడ్ల సురేష్ తో పాటు మరికొందరు అభ్యుదయ వాదులు పాల్గొన్నారు...
0 comments:
Post a Comment