728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Tuesday, December 1, 2020

యేసుక్రీస్తు దివ్యశాంతినిలయంలో రక్తదాన శిబిరం



 యేసుక్రీస్తు దివ్యశాంతినిలయంలో రక్తదాన శిబిరం


, చిలకలూరిపేట, పట్టణంలోని యేసుక్రీస్తు దివ్యశాంతినిలయంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలు ఎంతో మందికి స్ఫూర్తి నిస్తున్నాయని సామాజిక కార్యకర్త చుక్కా విన్సెంట్ పాల్ కొనియాడారు.మంగళవారం దివ్యశాంతినిలయంలో 7 వ రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈసందర్భంగా బ్రదర్ నందమూరి క్రిష్టర్ మాట్లాడుతూ రక్తదానంతో ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చని,ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో క్రిస్మస్ ను పురస్కరించుకోని నిర్వహిస్తున్నామన్నారు.నరసరావుపేట వైద్య విధాన్  

పరిషత్ సహకారంతో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో వంద మందికి పైగా ప్రజలు రక్తదానం చేశారని తెలిపారు.కుల,మత బేధం లేకుండా హైందవ, క్రైస్తవ,మహమ్మదీయలు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన దాతలందరికీ బ్రదర్ యన్ క్రిష్టర్ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త విన్సెంట్ పాల్,

నరసరావుపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దయానిధి,

మెడికల్ సిబ్బంది, శాంతినిలయం సంఘస్తులు తదితరులు పాల్గొన్నారు.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: యేసుక్రీస్తు దివ్యశాంతినిలయంలో రక్తదాన శిబిరం Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews