తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి .
చిలకలూరిపేట.ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు ఇటీవల కురిసిన భారి వర్షాల కారణంగా నాదెండ్ల మండలం లో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించడం జరిగింది. బుక్కాపురం, ఎండుగుంపాలెం, కనపర్రు, సాతులూరు, గ్రామాలలో నష్టపోయిన రైతులను కలిసి, వారితో మాట్లాడి జరిగిన నష్టాన్నితెలుసుకొని తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ,రైతులకు తగిన న్యాయం చేకూరుస్తామని ఇసందర్భంగా రైతులకు పార్టీ నేతలు చెప్పడం జరిగింది. బుక్కాపురం లోని రామారావు అనే రైతు పొలంలో తుఫాను కారణంగా కోసి కింద వేసిన వరి బోదెలను పరిశీలించడం జరిగింది .తడిసిన వడ్లు మొలకెత్తి రైతులకు అపార నష్టం జరిగింది, అలాగే అకాల వర్షాల వల్ల మిర్చి పంట పూర్తిగా దెబ్బతిన్నది, ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి మిర్చి పంటను సాగు చేసే రైతు పసిబిడ్డ వలే పంటను పెంచుతాడు, అటువంటి పంట కళ్ళముందే ఎండిపోతుంటే తట్టుకోలేని రైతు ఆత్మ స్థైర్యం కోల్పోయి, ఆత్మహత్య శరణ్యంగా భావిస్తున్న తరుణంలో వారికి ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించి తక్షణ సహాయం అందించవలసిందిగా ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. పత్తి, శనగ తదితర అనేక పంటలు ఈ వర్షాల వల్ల దెబ్బతిన్నాయని, నష్టపోయిన ప్రతి రైతు ను ఆదుకోవాలని , తడిసిన ధాన్యానికి గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని, వర్షాలకు దెబ్బతిన్న వరి, పత్తి పంటలకు, అలాగే శనగ పంటకు ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించి, వెంటనే రైతుల ఖాతాలలో జమ అయ్యేటట్లు చూడాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వన్ని డిమాండ్ చేసారు . ఈ పంట నష్టం పరిశీలనా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బండారుపల్లి సత్యనారాయణ ,సింగయ్య ,నాగోతు అంతయ్య ,కాజా ,అల్లం రామారావు ,దావల రవికుమార్ ,కాసిమాల రాజు తదితరులు పాల్గొన్నారు
0 comments:
Post a Comment