728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Tuesday, December 1, 2020

రైతు ఉద్యమంపై కేంద్ర సర్కారు ఉక్కుపాదం సిగ్గుచేటు.!




 రైతు ఉద్యమంపై కేంద్ర సర్కారు ఉక్కుపాదం సిగ్గుచేటు.!

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు.

ఢిల్లీ రైతు పోరులో రైతులపై బనాయించిన అక్రమఫ కేసులు తక్షణమే ఎత్తివేయాలి.

అన్నదాతల పొట్ట కొడితే మోడీ సర్కార్ కు పుట్టగతులుండవు.


ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా చిలకలూరిపేటలో  సీపీఐ, సీపీఎం,కాంగ్రెస్ పార్టీల ర్యాలీ


        కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాలపై దొడ్డిదారిన తెచ్చిన రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దుకై డిమాండ్ చేస్తూ దేశం నలుమూలల నుండి లక్షలాది మంది రైతులు ఢిల్లీలో సాగిస్తున్న రైతు ఉద్యమంపై మోడీ సర్కార్ రైతులపై పాశవికంగా జల ఫిరంగులు టియర్ గ్యాస్ లు, లాఠీచార్జిలతో పోలీసులతో ఉక్కుపాదం మోపడం ప్రజాస్వామ్య వ్యవస్థకు సిగ్గుచేటని  సీపీఐ ఏరియా కార్యదర్శి cr మోహన్ ధ్వజ మెత్తారు. ఢిల్లీలో రైతు పోరు పై దమనకాండ ఆపాలని, పదివేల మంది రైతులపై మోపిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ  నిర్వహించారు.

       ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి యం. రాధాకృష్ణ  మాట్లాడుతూ  కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికార మందబలంతో బిల్లులను తెచ్చి దేశంలో వ్యవసాయాన్ని దివాలా తీస్తూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. రైతేరాజు అని కొనియాడుతూనే మరోపక్క రైతులను బొంద పెట్టే విధంగా రాజకీయ విధాన కుట్రలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అన్నదాతల ఆక్రందనలు, ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్న వాటి నివారణ చర్యలు చేపట్టకపోగా రైతు నడ్డి విరిచే ఆర్థిక సంస్కరణలు తేవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. సీపీఎం   నాయకులు రాధాకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టప్రకారం మార్కెట్ యార్డులు ఎత్తివేసి కార్పొరేట్ బహుళజాతి గుత్త పెట్టుబడిదారుల చేతుల్లో వ్యవసాయ రంగాన్ని ఉంచి, వ్యవసాయ రంగం నుండి ప్రభుత్వం క్రమంగా తప్పుకునే రహస్య ఒప్పందాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు కటిక దారిద్ర్యాన్ని చూస్తున్నారని పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన ఆ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని వాపోయారు.  రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లక్షలాది మంది రైతులు 95,000 ట్రాక్టర్లతో ఆరు నెలలకు సరిపడినంత ఆహార ధాన్యాలతో స్వచ్ఛందంగా పార్లమెంటు ముట్టడికి శాంతియుతంగా బయలుదేరితే  వాటిని పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం రైతు నిరసనను మనిషి వేసే పద్ధతులు రైతు పోరుపై అనేక రకాల నిర్బంధాలు మోపుతూ అన్నదాతలపై విచక్షణ రహితంగా లాఠీచార్జిలు జరపడం హేయమైన చర్య అని అన్నారు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బతికి బట్ట కట్ట లేదని, రైతు పుట్టకోడితే కేంద్రానికి పుట్టగతులుండవని హెచ్చరించారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు పోరాటానికి యావత్ ప్రపంచమే సంఘీభావం ప్రకటిస్తూ రైతు పోరాటానికి అండగా నిలుస్తుందని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

    *ఈకార్యక్రమంలో AIYF జిల్లా కార్యదర్శి సుభాని, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు,అధ్యక్షుడు పి.వరహాలు,రైతు నాయకులు టి.బాబురావు, సీపీఐ వేలూరు గ్రామ కార్యదర్శి కండిమల్ల వెంకటేశ్వర్లు, గొట్టిపాటి రోసియ్య, సురభి రాజు,సీపీఎం నాయకులు పోపురి సుబ్బారావు,పెరుబోయిన వెంకటేశ్వర్లు,సతులూరి బాబు,కారుసల రోసియ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు జాస్తి నగంజానేయులు,ఉమర్ వలి,క్రాంతి, కాటూరి కోటేశ్వరరావు,అద్దంకి అనిల్,రాజు నాయక్,సాంబశివ నాయక్,కె.రాజా,వినయ్ కుమార్ జనక్రాంతి పార్టీ నాయకులు గౌస్, సీమాంధ్ర సాధన సమితి అల్లాహ్బక్షు తదితరులు పాల్గొన్నారు.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: రైతు ఉద్యమంపై కేంద్ర సర్కారు ఉక్కుపాదం సిగ్గుచేటు.! Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews