బషీర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన బషీర్ జన్మదిన వేడుకలు...
చిలకలూరిపేట : పట్టణం లోని ఎన్టీఆర్ కాలనీ సమీపంలో ఉన్నటువంటి శ్రీ సాయి ప్రశాంతి వృద్ధుల ఆశ్రమం నందు నాదెండ్ల మండలం కనపర్తి గ్రామానికి చెందిన షేక్. బషీర్ యువ నాయకులు జన్మదిన సందర్భంగా బషీర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు అన్నదానం నిర్వహించడం , గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఫ్రూట్స్ , బ్రెడ్ లు పంచడం జరిగింది . బషీర్ పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు,వృద్ధులకు సహాయం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా షేక్ కరీముల్లా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ నాగూర్ సుభాని పాల్గొని బషీర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి పేదల ఆకలి తీర్చిన బషీర్ మిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ సుభాని, బుడే,మస్తాన్వలి, రహమాన్, రమేష్ , సుభాని , జానీ , నాగేశ్వరరావు , రామారావు , మోహన్ , గౌస్, గోపి తదితరులు పాల్గొన్నారు...
0 comments:
Post a Comment