చిలకలూరిపేట .. పట్టణంలోని పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ ఆవరణలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యాలయం లో గణపవరం గ్రామానికి చెందిన పుట్టా నాగేశ్వరావు ను నాదెండ్ల మండలం కార్మిక విభాగం అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన నియామక పత్రాన్ని నియోజకవర్గ అధ్యక్షులు మాదాసు పృథ్వీరాజ్ సాయి , నందా యువసేన కోస్తాంధ్ర జిల్లాల అధ్యక్షులు నాగేశ్వరరావు , నియోజకవర్గ కార్యదర్శి వెంకటేశ్వర రాజు చేతుల మీదగా అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను బీసీ కార్మికుల కోసం బీసీల బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు మల్ల కోటేశ్వరరావు ( కోటి ), నాదెండ్ల మండల యువజన విభాగం అధ్యక్షులు శ్రీనివాస రావు , చిలకలూరిపేట మండల అధ్యక్షులు మహేంద్ర మరియు యువజన విభాగం నాయకులు విద్యార్థి విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు
0 comments:
Post a Comment