మీరంతా బాగా ఎదిగితే జగనన్న జన్మ సార్థకమైనట్లేనని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. మండల కేంద్రం యడ్లపాడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని బుధవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడాదిన్నర కిందట ఈ పాఠశాల దుస్థితి తన దృష్టికి వచ్చిందని చెప్పారు. గతేడాది జూన్‌లో అప్పట్లో రెకుల షెడ్డు, అది కూడా అద్దెకు నడుస్తున్న పాఠశాలను తాను పరిశీలించానని గుర్తు చేసుకున్నారు. అప్పట్లోనే అతి త్వరలో విద్యార్థులకు నూతన భవనం వచ్చేలా చూస్తానని తాను హామీ ఇచ్చానని తెలిపారు. ఆ వెంటనే పాఠశాల నిర్మాణం కోసం స్థలాన్ని వెతికామని, నిధులు కూడా మంజూరు చేయించామని చెప్పారు. గతేడాది ఆగస్టులో పాఠశాల భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. ఏడాది తిరిగేలోగా భవనాన్ని ప్రారంభించుకోగలిగామని వెల్లడించారు. ఇదంతా వైఎస్ జగనన్న చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. పాఠశాల దుస్థితిని ఆయన దృష్టికి తీసుకెళ్లగానే.. నిధులు మంజూరుచేసి పనులు పూర్తయ్యేలా చేశారని వివరించారు. ఇప్పుడు అద్భుతమైన భవనంలో విద్యార్థులు చదువుకునే వీలు కలిగిందని పేర్కొన్నారు.
నాణ్యమైన చదువుల కోసం ఎన్నో పథకాలు
పేద విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందించేందుకు తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలుచేస్తున్నదని ఎమ్మెల్యే తెలిపారు. మన రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో రూపాయికి ఏకంగా 20 పైసలు విద్యారంగం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖర్చు చేస్తున్నారని తెలిపారు. జగనన్న విద్యాకానుక, నాడు- నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాదీవెన, విద్యావసతి.. ఇలా ఎన్నో పథకాలు ఈ రోజు రాష్ట్రంలో విద్యార్థుల ఉజ్వల భవితకు ఊతంగా అమలవుతున్నాయని వివరించారు. అన్నింటికి మించి అమ్మ ఒడి పథకం ఎన్నో సత్ఫలితాలను ఇస్తోందని తెలిపారు. పిల్లలంతా చదువులకు వెళ్లేలా ఈ పథకం తోడ్పాటును అందిస్తున్నదని వివరించారు. దేశంలోనే విద్యా విప్లవం సాధించిన రాష్ట్రంగా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ నిలిచిందంటే ఆ ఘనత కచ్చితంగా జగన్ గారికే దక్కుతుందన్నారు. ఎంపీపీ తలతోటి ఝాన్సి మాట్లాడుతూ రూ.1.5 కోట్ల నిధులతో అత్యాధునికంగా భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. జెడ్పీటీసీ సభ్యుడు ముక్తా వాసు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో విద్యనభ్యసిస్తున్నవారంతా అదృష్టవంతులని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ కల్లూరి బుజ్జి మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ హయాంలో చదువుకుంటున్న పిల్లలను గురించి పట్టించుకున్న నాథులే లేరని, ఇప్పుడు పేదలంతా హాయిగా తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఆంజనేయులు,ఎంపీడీఓ మాధురి,తహశీల్దార్ శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు గడ్డిపాటి శివపార్వతి,యడ్లపాడు మండల జడ్పీటీసీ ముక్తా వాసు,ఎంపీపీ పిడతల ఘాన్సీ సాగర్,సర్పంచ్ లు కారుచోల హేమ,సుబ్బారావు,నరసింహ రాజు, ఎంపీటీసీ కీర్తి అరుణ్,సయ్యద్ సుభాని,మండల అధ్యక్షుడు కల్లూరి విజయకుమార్,మున్సిపల్ చైర్మన్ రఫాని,నాయకులు మాదం శ్రీనివాసరావు, కర్నాటి సుబ్బారావు,ఆలోకం లక్ష్మీనారాయణ,గౌరీ హనుమంతరావు, జాకీర్,శేషయ్య,పావులూరి వాసు,శ్యాం పాల్,సాంబయ్య,మద్దూరి భాస్కర్ రెడ్డి,జాజుల రామారావు,మరియు పలువురు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment