మద్యపాన నిషేదం పై జగన్ మోహన్ రెడ్డి, మాట తప్పి మహిళలను మోసం చేశారు: చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుమహిళా విభాగ నేతలు
చిలకలూరిపేట పట్టణంలో స్థానిక నరసరావుపేట రోడ్డు నందు తెలుగు మహిళా విభాగ నేతల ఆధ్వర్యంలో మద్యం సీసాలు పగలగొట్టి వినూత్న నిరసన చేశారు. మద్యం సీసాలు ధ్వంసం చేసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, మహిళా ఎమ్మెల్యేలకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగ నేతలు మాట్లాడుతూ, మద్యపాన నిషేధం పై జగన్ మోహన్ రెడ్డి మాట తప్పి మహిళలను మోసం చేశారని! కేవలం కమిషన్ల కోసం కక్కుర్తి పడి మహిళల తాళిబొట్టులతో చెలగాటమాడుతున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని మహిళల తలలు నిమిరి మరి చెప్పి అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధం చేయకపోగా దేశంలో ఎక్కడా లేని కల్తీ బ్రాండ్స్ తెచ్చి మహిళల తాళిబొట్లుతో చెలగాటం ఆడుతున్నారని చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగు మహిళా విభాగ నేతలు మండిపడ్డారు. మద్యపానం నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి మద్యం పై టార్గెట్లు విధించి మరి అమ్మటం సిగ్గుచేటన్నారు? జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన నకిలీ బ్రాండ్స్ తాగిన వారు కిడ్నీ వ్యాధులు, కడుపులో మంటతో తదితర వ్యాధులతో బాధపడుతూ చనిపోతున్నారు అని వారి కుటుంబ సభ్యులు అనాధలుగా మారిపోతున్నారని అన్నారు. నకలి బ్రాండ్లు వెంటనే నిషేధించాలి లేకపోతే అన్ని షాపులో సీసాలు పగలగోడతాం అని హెచ్చరించారు. జగన్ మోహన్ రెడ్డి కమీషన్ల కోసం కాకుండా ప్రజల ప్రాణాల కోసం ఆలోచించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే మద్యపాన నిషేధం అమలు చేయాలి లేకపోతే మహిళలు రాష్ట్రంలో వైసీపీని పూర్తిగా నిషేధిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జరీనా సుల్తానా, అమరా రమాదేవి, పోపూరి లక్ష్మి, పాములపాటి శివమ్మ, అద్దంకి అనిత భాయ్, రాయి పద్మా, కూనల ప్రమీల, మిద్దెలవనితా భాయ్, షేక్ హనీఫా బీ తదితరలు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment