పేద ప్రజల రారాజు రంగా. చిలకలూరిపేట: ఫ్రెంచ్ భాషలో రంగా అంటే సింహం అని అర్ధమని తల్లిదండ్రులు ఏ ఆలోచన తో నామకరణం చేసినప్పటికీ సార్ధకత చేకూర్చి పెట్టిన గొప్ప ప్రజా నాయకుడు వంగవీటి మోహన రంగా అని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి యం రాధాకృష్ణ అన్నారు వంగవీటి మోహన రంగా 33 వ వర్ధంతి కార్యక్రమం జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పులుగుజ్జు చంద్ర అధ్యక్షతన ఘనంగా జరిగింది. స్థానిక రైతుబజార్ వద్ద గల రంగా విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. జైలులో ఉండి ప్రజాప్రతినిధులు గా ఎన్నికైన ఇద్దరిలో ఉత్తరభారతం నుండి జనతాపార్టీ ద్వారా జార్జ్ ఫెర్నాండెజ్ దక్షిణ భారత దేశం నుండి కాంగ్రెస్ పార్టీ ద్వారా వంగవీటి మోహన రంగాలు ఉన్నారని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన పులుగుజ్జు చంద్ర మాట్లాడుతూ కాపు అంటే రక్షకుడని కాపు కాచేవాడనే అర్ధాన్ని పరమార్ధం గా భావించి జీవితకాలం పేద ప్రజల రక్షకుడు గా నిలిచిన రంగా ధీరోదాత్తుడైన ప్రజా నాయకుడని కొనియాడారు. రంగా వారసులు శిష్యులు కాంగ్రెస్ పార్టీ లో చేరి వారి ఆశయసాధన కోసం కృషి చేయాలని కోరారు. రంగా ఆశయ సాధన కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల సేవాదళ్ అధ్యక్షులు షేక్ ఖాజా బుడే సీనియర్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు షేక్ బాషా నాయకులు గోవిందు శివ సుంకర హరిబాబు దాసరి శ్యాం బాబు మిరియాల వెంకటరత్నం తిరుమల శెట్టి హనుమంతరావు దాసరి పూర్ణచంద్రరావు వి పోతురాజు వి సంగీత రావు జి సాయి పూజిత్ ఎన్ బి ప్రకాష్ నాయక్ అల్లం సుబ్బారావు మాడా శివ ప్రసన్న బాబు షేక్ కరి ముల్లా షేక్ బాజీ జి పరమేశ్వర రావు బి వెంకటేశ్వర్లు పల్లె పోగు రాజు తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment