శావల్యాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగ్ల ఉపాధ్యాయులు బెజవాడ వెంకట నాగేశ్వరావు గారు తెలుగు రాష్ట్రాల్లో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఉపాధ్యాయులందరికీ స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు గారు పేర్కొన్నారు. ప్రత్తిపాటి పుల్లారావు స్వగృహంలో, ఆదివారం నాగేశ్వరరావు ను ప్రత్తిపాటి సన్మానించారు. బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దేశ విదేశాల్లో స్థిరపడిన తన శిష్యులు, బంధుమిత్రులు, ఉపాధ్యాయుల సహకారంతో సుమారు రూ.39.79 లక్షలు సమీకరించి ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు, వికలాంగులకు బాల, బాలికలకు తదితరులకు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో నిత్యావసరాలు, బియ్యం, కూరగాయలు అందజేయడం అభినందనీయమని ప్రత్తిపాటి కొనియాడారు. ఈనాటి ఈ సన్మాన కార్యక్రమంలో మాజీ AMC చైర్మన్ తేళ్ళసుబ్బారావు, నాదెండ్ల మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, యడ్లపాడు మండల అధ్యక్షులు ముద్దన నాగేశ్వర రావు, ఉపాధ్యాయులు కోనూరి సాంబశివరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చాగంటి శ్రీనివాసరావు, గడిపూడి అనంతరావు, మున్నంగి సుబ్బారావు, కొండ్రగుంట వెంకటనారాయణ, బాచిన రఘుబాబు, సలిసం శ్రీను, జవ్వాజి బుచ్చిబాబు, తిమ్మిశెట్టి శ్రీనివాసరావు మొదలగువారు పాల్గొని బీవీ నాగేశ్వరావు ను అభినందించారు.
బీ.వీ.నాగేశ్వరరావు గారిని ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు అడాలి:
బీ.వీ.నాగేశ్వరరావు గారిని ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయులు అందరూ సమాజ సేవకు ముందుండాలి: మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు .
0 comments:
Post a Comment