వైద్యో నారాయణో హరి అన్న సూక్తి ని నిజం చేస్తున్న డాక్టర్ కృష్ణ మోహన్. కార్పొరేట్ వైద్యం వర్ధిల్లు తున్న పరిస్థితుల్లో వందల సంఖ్యలో ఉచిత దంత వైద్య శిబిరాలు నిర్వహించి దంత విజ్ఞానం పెంపొందించేందుకు కృషి చేసిన ప్రజా వైద్యులు డాక్టర్ కృష్ణ మోహన్ అని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి యం రాధాకృష్ణ అన్నారు. డాక్టర్ కృష్ణ మోహన్ రాష్ట్ర దంత వైద్యుల సంఘ అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా డాక్టర్ కృష్ణ మోహన్ ను సన్మానించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ బాలలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వృద్దులలో దంత విజ్ఞానం పెంపొందించే విధంగా అనేక ఉచిత దంత వైద్య శిబిరాలు నిర్వహించి పేస్టులు బ్రష్ లు మందులు పంపిణీ చేసి వైద్యో నారాయణో హరి అనే సూక్తిని నిజం చేసారని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు గా అన్ని జిల్లాల్లో ఉచిత దంత వైద్య శిబిరాలు నిర్వహించి చిలకలూరిపేట పేరు రాష్ట్ర వ్యాప్తం గావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు జాష్టి నాగాంజనేయులు, నియోజకవర్గ యువ జన కాంగ్రెస్ అధ్యక్షుడు మద్దు మాల ప్రసన్నాంజనేయులు, ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు షేక్ బాషా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు షేక్ కరిమూన్, కాంగ్రెస్ లీగల్ సెల్ నాయకులు ఎప్పాల అంజిరెడ్డి, సామా శ్రీనివాస రావు, మండల కాంగ్రెస్ సేవా దళ్ అధ్యక్షుడు షేక్ ఖాజాబుడే, నాదెండ్ల శంకరరావు, యువ జన కాంగ్రెస్ నాయకులు షేక్ ఉమర్ అలీ, షేక్ సుబాని, పి శ్రీనివాస రావు, లలితబాబు ,బొజ్జా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు..
Sunday, December 26, 2021
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment