వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వంగవీటి మోహన రంగా వర్థంతి
ఈ రోజు చిలకలూరిపేట నియోజకవర్గ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో,పార్టీ నాయకులు విడదల గోపి సమక్షంలో వంగవీటి మోహన రంగా వర్థంతిని ఘనంగా నిర్వహించారు,ముందుగా పట్టణంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రంగా గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు,అనంతరం విశ్వనాధ్ హాల్ దగ్గర ఉన్న రంగా విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు,అనంతరం అడ్డరోడ్డు సెంటర్లోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, పురుషోత్తమపట్నం ట్రాక్టర్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నాయకుడు వంగవీటి మోహన రంగా అని కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఆరాధించడం సంతోషంగా ఉందన్నారు. పేదల కోసమే రంగా గారు పనిచేశారని, అందుకే ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారని,అలానే మన ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి అటువంటి మహనీయుల స్పూర్తితో బడుగుబలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ షేక్ రఫాని,వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీను,మార్కెట్ యార్డ్ చైర్మన్ మద్దిరాల విశ్వనాధం,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు విడదల లక్ష్మీనారాయణ,బత్తినేని శ్రీనివాసరావు,సొసైటీ అధ్యక్షులు తోట బ్రహ్మాస్వాములు,జడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్ రావు,పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహ ఖాన్,రాష్ట్ర ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా వలి,ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు,కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి,కోట నాయక్,బిట్రా రాజేంద్ర,యూసుబ్,నాయకులు కాసా రామశ్రీను,ఉయ్యురు నరసింహారావు,తోట సురేష్,కూనపురెడ్డి నాగభూషణం,సాకిరి శేషయ్య,ఏకాంబరం సునీత,కటారి సుధాకర్,ఇక్కుర్తి భార్గవ్,తోట సత్యనారాయణ,ఇర్రి రాఘవ,తోట మధు,విడదల శేషగిరి,ఇంటూరి నాగేశ్వరరావు,తోట రామయ్య,మిరియాల సురేష్,నాగబైరు వెంకట్,నకిరికంటి శ్రీకాంత్,జిలాని,శొంఠి శ్రీను,విష్ణు నాయక్,ఊసా రమేష్,మోషే,సాంబశివరావు మరియు పలువురు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment