యడవల్లి రైతుల భూముల పరిహారం విషయం పై లోతైన దర్యాప్తు జరిపించాలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం డిమాండ్.
ప్రెస్ నోట్..05.01.2022..చిలకలూరిపేట.
ఎమ్మెల్యే విడదల రజనీ దళారుల చేతిలో మోసపోయిన యడవల్లి దళిత రైతులను పరామర్శించి వారికి న్యాయం చేయాలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. చుండూరు, కారంచేడు ఘటనల్లో తరహాలో కాకున్నా అదేమాదిరిగా యడవల్లి దళితులకు ప్రభుత్వం భూముల కోసం ఇచ్చిన నష్ట పరిహారంలో దళారులు చేతివాటం చూపించి కోట్ల రూపాయలు వెనకేసుకున్న విషయం లో చిలకలూరిపేట తహసీల్దార్ పైన ,దళారుల పై విచారణ జరిపించాలని రావుసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, పాలాభిషేకం చేసినంత మాత్రాన దళితులకు న్యాయం చేసినట్లు కాదని, వారికిచ్చిన పరిహారం లాక్కుని మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అందుకు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని బాధ్యత తీసుకోవాలని కోరారు. చెక్కులు లాక్కుని బ్యాంక్ వద్ద డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకునే పరిస్థితి లో ఎమ్మెల్యే ఉన్నారా? అని ప్రశ్నించారు.కోట్లాది రూపాయలు స్కాం యడవల్లి లో జరిగింది అని దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు.చిలకలూరిపేట తహశీల్దార్ కార్యాలయంలో చెక్కులు పంపిణీ లో అవకతవకలు జరిగాయని సి ఐ డి దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో విచారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించాలని డిమాండ్ చేశారు. చిలకలూరిపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట 05.01.2022 బుధవారం ఉదయం జరిగిన నిరాహారదీక్ష శిబిరంలో రావుసుబ్రహ్మణ్యం బాధితులకు సంఘీభావం తెలిపారు.బాధితులకు న్యాయం జరిగే వరకు నవతరంపార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
0 comments:
Post a Comment