పత్రికాప్రచురణర్థం ✍🏻
పాఠశాల మానిటరింగ్ కమిటీ సమావేశం
ప్రభుత్వ పాఠశాలల పునః ప్రారంభోత్సవ నేపథ్యంలో పాఠశాలల విద్యార్థుల తల్లి దండ్రులు తో సమావేశం నిర్వహించి నూతన అడ్మిషన్లు చేయడం గురించి,విద్యార్థుల ప్రగతి,పాఠశాల మౌళిక సదుపాయాలు,పాఠశాలలో అందుతున్న నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన,జగనన్న అమ్మవొడి జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద డిజిటల్ క్లాసుల నిర్వహణ నో బ్యాగ్ డే వంటి కార్యక్రమాలు గురించి న అవగాహన విద్యా సంబంధ అంశాలు ఈ రోజు ఉదయం జరిగిన సమావేశం లో చర్చించడం జరిగింది. చిలకలూరిపేట మునిసిపల్ ప్రైమరీ స్కూల్ సూపర్ వైజర్ పోటు శ్రీనివాసరావు, మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. పాఠశాల ప్రధనోపాధ్యాయులు శ్రీమతి కే సుధ మాట్లాడుతూ సమాజ భాగస్వామ్యం తోనే పాఠశాలల అభివృద్ధి సాధ్యమని అన్నారు.పాఠశాల పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ గోగుల.నాగరాజుమాట్లాడుతూ సమయ పాలన పాటిస్తూ విద్యార్థులను పాఠశాలకు పంపాలన్నారు.కమిటీ వైస్ చైర్మన్ షేక్ షకీలా సభ్యులు,తల్లి దండ్రులు పాల్గొన్నారు
0 comments:
Post a Comment