ప్రముఖ వైద్యులు డాక్టర్ పావులూరి శివరామయ్య కన్నుమూత
చిలకలూరిపేట: పట్టణానికి చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ పావులూరి శివరామయ్య (83) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనకు భార్య అంజనీదేవి, కుమారులు వీర శేఖర్, నాగేశ్వర రావు , కుమార్తె లక్ష్మి లు ఉన్నారు. ఆయన స్వగ్రామం ఎడ్లపాడు మండలంలోని తిమ్మాపురం. 1974 లో చిలకలూరిపేట పట్టణం లోని గాంధీ పేట లో వైద్య వృత్తి ప్రారంభించారు. ఆ తర్వాత లక్ష్మి పిల్లల ఆసుపత్రి పేరుతో హైస్కూల్ రోడ్ లో ఆస్పత్రిని ఏర్పాటు చేసుకున్నారు. ఆసుపత్రిని ప్రారంభించి నలభై ఐదు సంవత్సరాలుగా ఆయన వైద్య వృత్తి నిర్వహించారు. చిలకలూరిపేట పట్టణంలో తొలినాళ్ళలో పిల్లల వైద్యునిగా పేరు ప్రఖ్యాతలు పొందారు. పండరీపురంలోని7 లైన్ లో గల శివరామయ్య నివాసంలోని ఆయన భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు, వైద్యులు నివాళులర్పించారు. ఈరోజు సాయంత్రం 2 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
0 comments:
Post a Comment