చిత్తూరు జిల్లా - శ్రీకాళహస్తి
*శ్రీకాళహస్తీశ్వరుని ఆశీస్సులతో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలి - పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్*
*చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తిలో వేంచేసి ఉన్న పరమశివున్ని దర్శించుకుని గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో కుంటుపడిన గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలని కోరుకున్న రాజేంద్రప్రసాద్.*
*ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ....*
గ్రామాల అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాల ద్వారా పంపించిన రూ,,8629 కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం దిగమింగి వేసిందని, దానిపై మా ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్, రాష్ట్ర సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసినా జగన్ స్పందించకపోవడంతో మొన్న మే 13 వ తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మా సర్పంచ్ల తడాఖా ఏంటో జగన్కు చూపించామని, దాని ఫలితం రేపు జూన్ 4వ తారీఖు జగన్కు అర్థమవుతుందని, అలాగే కేంద్ర ప్రభుత్వం క్రొత్తగా రెండు నెలల క్రితం రాష్ట్రానికి పంపించిన రూ,,988 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు గ్రామ పంచాయతీలకు విడుదల చేయకుండా ఆ నిధులను దారి మళ్ళించి కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించుకున్నారు.దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని,వెంటనే ఆ నిధులను గ్రామపంచాయతీలకు విడుదల చేయాలని జవహర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నామని రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, చొక్కా ధనుంజయ యాదవ్, కిరణ్, రవి,ప్రకాష్ నాయుడు, కుప్పాల మురళి తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment