వినుకొండ శివయ్య భవన్ ఎఐటియుసి ఆఫీసులో ఎఐటియుసి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎఐటియుసి ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వివిధ రకాల పథకాలు అమల్లో ఉన్నాయని, 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాల పేరుతో అవన్నీ తొలగించేసి కార్మికులను మోసం చేశాడన్నారు. ఇసుక పాలసీ అంటూ ఇసుక వ్యాపారం మొదలుపెట్టి ఇసుక కొరత సృష్టించి కార్మికుల ఆకలి చావులకు అప్పులకు కారకుడు అయ్యాడని విమర్శించారు. సంక్షేమ బోర్డుపై కన్ను పడి బోర్డులోని నిధులను విడతల వారీగా 1600 కోట్లు తీసుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి నవరత్నాలకు ఆ నిధులను వాడుకున్నారని, బోర్డులోని సభ్యులకు క్లయిమ్ చెల్లించకుండా కార్మికులను తిప్పలు పెడుతున్నారని, కార్మికులు పని ప్రదేశంలో ప్రమాదం జరిగి ఆసుపత్రి పాలైనా, చనిపోయినా, లేదా సహజ మరణం పొందినా పట్టించుకునే నాధుడు లేడన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఒకే తరహాలో భావన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలని కొత్త ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పున ప్రారంభించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు పిన్నబోయిన వెంకటేశ్వర్లు, సోమవరపు దావీదు, యస్ కె మస్తాన్, రాయబారం వందనం, కొప్పెరపు మల్లికార్జున, మరియ బాబు, సామేలు, సుభాని, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
Tuesday, June 18, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment