*
ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీ కోసం) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి: వినుకొండ రూరల్ సీఐ సుధాకర్ రావు*
పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ సీఐ సుధాకరరావు ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీకోసం) కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ సమస్యలపై వినుకొండ రూరల్ మండలాలైన ( ఈపూరు, నుజండ్ల, బొల్లాపల్లి మరియు శావల్యాపురం) మండల ప్రజలు సుదూర ప్రాంతాల నుండి జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ గారికి ఫిర్యాదు చేసేందుకు పల్నాడు జిల్లా, నరసరావుపేట ఎస్పీ కార్యాలయానికి వెళ్ళవలసిన అవసరం లేకుండానే వినుకొండ రూరల్ సర్కిల్ ఆఫీస్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం ద్వారా ఎస్పీగారికి కి ఫిర్యాదు చేసినట్లుగానే భావించి, మీరు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించినట్లుగా రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందని, మరియు అట్టి ఫిర్యాదులపై సత్వర పరిష్కారం జరుగుతుందని, సిఐ సుధాకరరావు గారు అన్నారు. ఈ కార్యక్రమాన్ని వినుకొండ రూరల్ మండలాలైన ( ఈపూరు, నుజండ్ల, బొల్లాపల్లి మరియు శావల్యాపురం) మండల ప్రజలు వినియోగించుకోవాలని వినుకొండ రూరల్ సీఐ సుధాకరరావు విజ్ఞప్తి చేశా
0 comments:
Post a Comment