*ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక చిలకలూరిపేట మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలిపి అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ కు అందచేయడం జరిగినది. కార్యక్రమాన్ని ఉద్దేశించి పల్నాడు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు తాళ్లూరి బాబురావు మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి నాగభైరు. రామసుబ్బాయమ్మ, సిపిఐ పట్టణ కార్యదర్శి పేలూరి రామారావు, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు చండ్ర కొండలరావు, పర్వతనేని లక్షాధికారి, పోతవరం మహమ్మద్ సాహెబ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు చౌటుపల్లి నాగేశ్వరరావు, ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి మేకపోతుల నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు బొంతా భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.*
0 comments:
Post a Comment