*ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంద టిడ్కో పాయింట్ నూతన కమిటీని శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగినది. నూతన కమిటీ గౌరవాధ్యక్షులుగా నాగభైరు రామసుబ్బాయమ్మ, పేలూరి రామారావు, అధ్యక్షులుగా ఎన్ కృష్ణ, ఉపాధ్యక్షులుగా గంగవరపు ఏసుబాబు, కార్యదర్శిగా రేపూడి రాజేష్, సహాయ కార్యదర్శిగా కుప్పం వెంకటేశ్వర్లు, కోశాధికారిగా శివప్రసాంజనేయులు, కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగినది. కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ సిపిఐ ఇన్చార్జి కార్యదర్శి నాగభైరు రామసుబ్బాయమ్మ, ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షులు పేలూరి రామారావు, సిపిఐ నాయకులు బొంతాభగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.*
0 comments:
Post a Comment