**చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జగ్జీవన్ రాం గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి*
చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ S.C సెల్ అధ్యక్షులు కొండా వీరయ్య గారి అధ్యక్షతన జగ్జీవన్ రాం గారి వర్ధంతి కార్యక్రమము నిర్వహించటం జరిగింది, ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఇనగంటి జగదీష్ గారు,పట్టణ పార్టీ అధ్యక్షులు పటాన్ సమద్ ఖాన్ గారు జగ్జీవన్ రాం గారి చిత్ర పటానికి పూల మాల వేయటం జరిగింది,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి పటానికి పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి గారు,పట్టణ S.C సెల్ ప్రధాన కార్యదర్శి గట్టుపల్లి మణిక్యారావు గారు వారి పటానికి పూల మాల వేయటం జరిగింది.పలువురు నాయకులు, కార్యకర్తలు కొబ్బరికాయలు, పులా మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంధర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జగ్జీవన్ రాం గారు,
"స్వాతంత్ర్య సమర యోధుడు అని, సంఘ సంస్కర్త,రాజకీయవేత్త, బాబూజీగా ప్రసిద్ధుడు చెందరు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించిన,బాబూ జగ్జీవన్ రాం గారి వర్ధంతి సందర్భంగా ,చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈ వర్ధంతి కార్యక్రమము నిర్వహించటం,చాలా సంతోషం గాను ,వారిని స్ఫూర్తిగా తీసుకొని నడవాలి అని అన్నారు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గం లోని వివిధ హోదాల్లో గల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొనడం జరిగింది.
0 comments:
Post a Comment