రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న సందర్భంగా కమిషనర్ గోవిందరాజు గారితో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజ రమేష్ గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా రాజ రమేష్ గారు మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణంలోని అన్ని సచివాలయాలలో ప్రభుత్వం ఆదేశించిన మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలను ఏర్పాటు చేయాలని కోరారు. చిలకలూరిపేట పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కానీ ట్రాఫిక్ సిగ్నల్ సమస్యను పరిష్కరించాలని రాజా రమేష్ కోరారు. స్థానిక శాసనసభ్యులు ప్రత్తి పాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలో శానిటేషన్, విధి దీపాలు, నీటి సరఫరా సమస్య లేకుండా చేసి ప్రజలకు సహకరించాలని కమిషనర్ గోవిందరాజు గారిని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి ఈ రమణ గారు, పట్టణ అధ్యక్షులు మునీర్ హసన్ గారు, వెంకట్ , అవినాష్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment