శ్రీ దత్త సాయి సన్నిధిలో గురు పంచమి పూజలు భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం---చిలకలూరిపేట సుబ్బయ్య తోట శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు గురువారం పంచమిని పురస్కరించుకొని సద్గురు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక అర్చన అభిషేక పూజా కార్యక్రమాలు భక్తుల ప్రదక్షిణ కార్యక్రమాలు జరిగినాయి అనంతరం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది, ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ ఈనెల 21న ఆదివారం,గురు పౌర్ణమి అని ఆ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జాతక గురు బలసిద్ధి పూజ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ఆరోజు జరుగుతుందని మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతా ఉందని భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని బాబా గారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్న ప్రసాదం స్వీకరించాలని కోరారు భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అన్నదాన కార్యక్రమానికి సహకరించాలని కోరడమైనది ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దేవరకొండ నాగేశ్వరరావు పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరి హనుమంతరావు అయినవోలు హనుమంతరావు తదితర భక్త బృందం పాల్గొన్నారు
0 comments:
Post a Comment