భవిత కేంద్రం లో సౌకర్యాలు వినియోగించుకోవాలని పల్నాడు జిల్లా ఐ ఈ డీ కో ఆర్డినేటర్ అర్.సెల్వ రాజ్ తెలిపారు. ఈ రోజు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణ లో వున్న భవిత కేంద్రం సందర్శించి ఇంటింటి సర్వే నిర్వహించి అన్ని వార్డులలో వున్న మెంటల్ల్లీ రిటార్ట్. స్పీచ్ థెరపీ ఫిజికల్ ఛాలెంజ్ విద్యార్థినీ విద్యార్థులు గుర్తించి వారిని భవిత ఎడ్యుకేషన్ సెంటర్ నందు అడ్మిషన్ ఇప్పించి వారిని మెయిన్ స్ట్రీమ్ విద్యార్థులుగా తీర్చి దిద్ది రెగ్యులర్ పాఠశాల లో చేర్చాలని సూచించారు. మధ్యాహ్న భోజనం లో పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాల అందిస్తారని హియరింగ్ స్పీచ్ పరికరాలు ట్రాలీ లు అందించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం అందించే రాయితీలు పొందడానికి అవకాశం వుంటుందని అన్నారు.ఇంటింటికి తిరగడం ద్వారా గుర్తించిన విద్యార్థినిని ఈ రోజు పాఠశాలలో అడ్మిషన్ ఇవ్వడం జరిగింది.భవిత రిజిస్టర్స్.రికార్డ్స్ పరిశీ లించడం జరిగింది. తగు సూచనలు చేయడం జరిగింది.పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు.ఐ ఈ డీ టీచర్స్ కే.విశ్వ ప్రసాద్, ఏ.అప్పారావు తల్లీ దండ్రులు పాల్గొన్నారు.
Thursday, July 18, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment