*
*సీఆర్ వర్ధంతి సందర్భంగా 80 మంది పేదలకు బట్టలు పంపిణీ చేసిన CR కుటుంబసభ్యులు*
*మాట్లాడుతున్న సిపిఐ ఏరియా కార్యవర్గ సభ్యురాలు చెరుకుపల్లి నిర్మల,దాసరి వరహాలు*
*సీఆర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పిస్తున్న 25వ వార్డు సిపిఐ కార్యకర్తలు*
అమరవీరుడు సీఆర్ మోహన్ ఆశయాలను కొనసాగిస్తూ,పార్టీని బలోపేతం చేయటమే ఆయనకు అర్పించే ఘన నివాళి అని సీపీఐ ఏరియా కార్యవర్గ సభ్యురాలు చెరుకుపల్లి నిర్మల అన్నారు. సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు,
పోరాట యోధుడు సీఆర్ మోహన్ మూడో సంస్మరణ సభ బుధవారం పట్టణంలోని 25వ వార్డులో ఘనంగా నిర్వహించారు. ముందుగా సీఆర్ మోహన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చెరుకుపల్లి నిర్మల మాట్లాడుతూ సీఆర్ మోహనరావు నుంచి స్పూర్తి పొందాలని, అనారోగ్యం బాగా లేకపోయినా పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనే వారనిగుర్తు చేసుకున్నారు. నిబద్దత కలిగిన రాజకీయ నాయకుడిగా చివరివరకు కమ్యూనిస్టు పార్టీలో కొనసాగారని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం పునరంకితం కావాలని పిలుపు నిచ్చారు. కమ్యునిస్టుగా బతకడం, కమ్యూనిస్టుగా చనిపోవడం కొంతమందికే సాధ్యమౌతుందని, అటువంటి వారిలో సీఆర్ ఒకరని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు ఆయన బాసటగా నిలిచారని, అఖిల పక్ష రాజకీయ, ప్రజాసంఘాల ఐక్యతతో అనేక సమస్యలు సాధించారని తెలిపారు. నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే వారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా సీఆర్ జీవితంలో జరిగిన ఓ సంఘటనను ప్రస్తావిస్తూ ప్రజానాట్యమండలి నాటకం ప్రదర్శన ఉన్న సమయంలో తన భార్య చనిపోయినా, నాటకం ఆగకుండా పూర్తి చేశారని, పార్టీ కోసం , ప్రజల కోసం నిరంతరం పాటు పడ్డారని తెలిపారు. Aituc ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు మాట్లాడుతూ ప్రజలతో మమేకమైన ప్రజా నాయకుడు సీఆర్ అని కొనియాడారు. నిరంతరం పేద ప్రజల కోసం, కార్మికుల కోసం, ముఖ్యంగా పారిశుధ్య కార్మికుల కోసం జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. తాను నమ్మిన విలువల కోసం పాటు పడ్డారని , జీవితం చివరి వరకు పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేశారని వివరించారు. ఈ సందర్బంగా జోహార్లు అర్పించారు.80 మంది పేదలకు CR కుటుంబ సభ్యులు బట్టలు పంపిణీ చేసి, భోజన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీపీఐ ఏరియా కౌన్సిలర్ cr సృజన్,నరసింహ భారతి, శానం యలమంద,పోలయ్య సిఆర్ సన్నిహితులు, మిత్రులు, అభిమానులు పాల్గొని ఘనంగా వివాళులు అర్పించారు.
0 comments:
Post a Comment