అయిదేళ్ల ఏకంగా 1.75 లక్షల ఎకరాలకు పైగా భూములు ఆక్రమించుకున్న దిక్కుమా లిన, దోపిడీకోరు పాలన సాగించిన ఘనత పోయిన వైకాపా ప్రభుత్వానికే చెల్లుతుందని ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. పట్టపగ్గాల్లేకుండా సాగిన వారి అవినీతి, అక్రమాలు ఆధారాలతో బయటపెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారని, వాటితోనైనా వైకాపా అనకొండలు, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిజస్వరూపం ప్రజలకు తెలుస్తోందని ఎద్దేవా చేశారాయన. కూటమి ప్రభుత్వం వరసగా విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు, ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోన్న వైకాపా ప్రభుత్వం దారుణాలపై బుధవారం ఒక పత్రికాప్రకటన విడుదల చేశారు జీవీ. వారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకున్న పేదలకు సెంటు ఇళ్ల స్థలాల పేరిటే 10వేల ఎకరాల వరకు ఆక్రమాలు జరిగాయంటే వైకాపా పాలన ఎలా సాగిందో అర్థం చేసుకోవ్చని మండిపడ్డారు. అందుకే వైకాపా నేతలు ఎవరెవరు ఎక్కడెక్కడ, ఎంతెంత దోచుకున్నారో శ్వేతపత్రాల ద్వారా బయట పెడుతున్నామన్నారు. 5ఏళ్ల లో వైకాపా నేతలు సాగించిన లక్షా 75వేల ఎకరాల భూ ఆక్రమణల విలువ రూ. 35,576 కోట్లు పైమాటేనని తెలిపారు. అలా అడ్డదారుల్లో దోచుకుని, సొంతం చేసుకోవాలని అనుకున్న భూ దోపిడీకి ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దుతో అడ్డుకట్ట పడినట్లయిందని ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటున్నారని, ఆ సాహసోపేత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు వారంతా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారన్నారు జీవీ ఆంజనేయులు. భూములన్నీ కొట్టేయాలనే దుర్భుద్ధితోనే దేశంలో ఏ రాష్ట్రంలో చేయని నిరంకుశ చట్టాన్ని రాష్ట్రం నెత్తిన రుద్దాలని చూసిన నియంత జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. అదేగాక ఇసుకదందాల రూపంలోనే వైకాపా నేతలు రూ. 9,750కోట్లు దోచుకున్నారని, ప్యాలెస్‌లు, విలాసాలు, సలహాదారుల పేరిట వేల కోట్లు ప్రజాధనం ఖర్చు చేశారనీ మండిపడ్డారు జీవీ ఆంజనేయులు. వైకాపా నిర్వాకాలన్నింటి నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ఆలోచించి తీసుకునిరానున్న యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టంతో కబ్జాకోరుల గుండెల్లో రైళ్లు పరిగెట్టడం ఖాయమని, భూ యాజమాన్యహక్కుల ను నిరూపించుకోవాల్సిన బాధ్యతవారిపైనే ఉంటుందన్నారు జీవీ ఆంజనేయులు. త్వరలో రానున్న మిగిలిన శ్వేతపత్రాల్లో వైకాపా నేతల పూర్తి స్వాహాపర్వాలను ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతామని, జరిగిన అక్రమాలపై చట్టం తన పని తాను చేసుకుని పోతుందున్నారు జీవీ ఆంజనేయులు.
Thursday, July 18, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment