ఎమ్మెల్యే ప్రత్తిపాటి....
జగన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచటానికి ఐదు సంవత్సరాలు పట్టింది చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచారు ఇప్పుడు 4000 రూపాయలు అందిస్తున్న పెన్షన్ లో 3000 రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు గారిది....
జగన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం ఆరోజు చంద్రబాబు గారు హయాంలో 2000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ ని 3000 రూపాయలు చేస్తానని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత క్రమం పద్ధతిగా పెంచుకుంటూ అవ్వ తాతల్ని మోసం చేశారు....
చంద్రబాబు గారు ఎన్నికల హామీలు ఇచ్చిన ప్రకారం ఒక్కసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయల అందజేస్తున్నారు అవ్వ తాతల కళ్ళల్లో ఆనందం ప్రజల సంతోషమే చంద్రబాబు గారి జీవిత లక్ష్యం అంటూ రేపు ఆదివారం కావడంతో ఒక్కరోజు ముందు పెన్షన్ల పంపిణీ చేయడం ప్రజల్లో ఎంతో ఆనందం ఉత్సాహంగా ఉంది....
ప్రజల కోసం పుట్టిన బాబు గారు అనడానికి ఏమాత్రం సందేహం లేదు నిత్యం ప్రజల కోసం కృషి చేస్తూ ప్రజల సంతోషమే ఆయన జీవిత లక్ష్యం అంటూ ఈరోజు చిలకలూరిపేటలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు....
0 comments:
Post a Comment