*సీఎం ఆదేశాల మేరకు ఆఖరి బాధితుడికి కూడా సహాయం చేరేలా చూస్తున్నాం: ప్రత్తిపాటి*
*విజయవాడలో సహాయ చర్యలు పర్యవేక్షించిన ప్రత్తిపాటి పుల్లారావు*
సీఎం చంద్రబాబు చొరవ, ప్రయత్నంతోనే శరవేగంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం అందుతోందన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారా వు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానిదే ఈ ఘనత అని స్పష్టం చేశారు. విజయవాడ వరద విలయం జరిగిన మొదటిరోజు నుంచి ముఖ్యమంత్రి కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సాయాన్ని తీసుకుంటున్నారని, ఇప్పుడు స్వల్ప వ్యవధిలోనే కేంద్రమంత్రులు పర్యటించడం, కేంద్రం ఆర్థికసాయం కూడా ప్రకటించడం అన్నీ మరొకరికి సాధ్యమయ్యేవే కావన్నారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ పరిధిలో 4వ రోజూ ఆయన వరద పరిస్థితి, పునరావాస కార్యక్రమాలు పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగానికి సూచనలు, సలహాలు ఇస్తూ బాధితులకు సకాలంలో సాయం అందేలా చూశారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల్ని పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు శుక్రవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని సితార జంక్షన్, జోజినగర్, కబేళా సెంటర్, రోటరీనగర్, దాశరథి వీధి, మిల్క్ ఫ్యాక్టరీ రోడ్డు, తదితర ప్రాంతాల్లో బాధితులకు అందుతున్న సాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట్ల బాధితులకు ఆహారం, నీళ్లు అందేలా దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగారు. ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్‌పై తిరుగుతూ బాధితుల నుంచి సమస్యలు, అందుతున్న సాయాన్ని అడిగి తెలుసుకున్నారు. వరద బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్యశిబిరాలను పరిశీలించి వైద్యులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. బాధితుల నుంచి అందుతున్న ఫిర్యాదులు ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేశారు. వరద బాధితులకు ఆహారం, తాగునీటి ప్యాకెట్లు అందుతున్న తీరుపై స్వయంగా పర్యవేక్షించారు. ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు అందేలా చూస్తామని బాధితులకు భరోసా కల్పించారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారని.. సహాయ చర్యల్లో అలసత్వం వహిస్తే ఎవర్నీ ఉపేక్షించవద్దనీ చెప్పారన్నారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటనపై మీడియాతో మాట్లాడిన ప్రత్తిపాటి దేశంలో అత్యంత సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబు సమకాలీకులు ఆయన్నారు. వీరిద్దరూ ఈరోజు దేశంలో అనుభవజ్ఞులైన నేతలని, శివరాజ్‌సింగ్ చౌహాన్ 3సార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉంటే, ఇక్కడేమో చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. చంద్రబాబు ఆ అనుభవం మొత్తాన్ని కష్టాల్లో ఉన్న ప్రజల కోసమే వెచ్చిస్తున్నారని, క్షణం తీరికలేకుండా నిద్రహారాలు మానేసి కలెక్టరేట్‌లో బస్సులోనే ఉంటూ పేద ప్రజల గురించి ఆలోచిస్తున్నారన్నారు. విపక్ష జగన్‌రెడ్డి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా సాక్షి పత్రిక, ఛానెల్ ద్వారా దుష్ప్రచారం, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విమర్శించడానికే సాక్షి పత్రిక, ఛానెల్ పెట్టుకున్నట్లు కనబడుతోంది తప్ప వాస్తవాలు ప్రచురించడం లేదన్నారు. కానీ జగన్‌రెడ్డి, ఆ పార్టీలో ఉండే ఒకరిద్దరు విమర్శలు చేస్తున్నారు తప్ప ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారన్న ప్రత్తిపాటి ప్రజలే తమకు అన్ని సేవలు అందుతున్నాయని చెబుతున్నా రన్నారు. జరిగిన నష్టంపై ఆదుకోవాలనే వారు అడుగుతున్నారని, ఆ దిశగా కూడా చంద్రబాబు చర్యలు చేపట్టారన్నారు. బీమా కంపెనీల ద్వారా, ప్రభుత్వపరంగా ఎలా వీలైతే అలా ఆర్థిక సాయం చేయాలనే ఆలోచన చేస్తున్నారన్నారు. దాతలూ స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని, ఏదొక విధంగా సహాయపడాలనే ఆలోచన ప్రతిఒక్కరిలో కలుగుతుందన్నారు. జగన్ రెడ్డి వారి చూసైనా కాస్త బుద్ధి మార్చుకుంటే మేలని హితవు పలికారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.
0 comments:
Post a Comment