గాంధీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మోడరన్ కాంప్లెక్స్ ఎదురుగావున్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఘనంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా మహాత్ముని పూలమాలతో అలంకరించి ఘననివాళులు అర్పించడం జరిగినది .అనంతరం చిలకలూరిపేట ఏం ఎల్ ఏ శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారిచే జాతీయజెండా ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించడం జరిగింది. తదుపరి రక్షణరంగంలో ని నావికా విభాగంలో విశిష్ట సేవలు అందించిన సి.వి. హెచ్.రావు గారికి గాంధీ క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి గాంధీ క్లబ్స్ ఫ్రీడమ్ అవార్డు ను MLA శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారిచే అందించి సత్కరించడం జరిగింది .ఈ కార్యక్రమానికి ఘంటసాల బంగారుబాబు అధ్యక్షత వహించగా, మునిసిపల్ కౌన్సిలర్స్ పట్టణ ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం గావించారు .
0 comments:
Post a Comment