*పత్రికలపై కక్ష సాధిస్తున్న ప్రభుత్వాలకు తెలంగాణ హైకోర్టు తీర్పు గొడ్డలిపెట్టు*
*ఏ పత్రికల్లో పనిచేసినా జర్నలిస్టులంతా ఒక్కటే*
* కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లేల శివనాగేశ్వరరావు*
చిలకలూరిపేట:
పత్రికల పట్ల ప్రభుత్వాలు వివక్ష చూపకూడదన్న విషయం తెలంగాణా హైకోర్టు తీర్పుతో వెల్లడైందని కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లేల శివనాగేశ్వరరావు అన్నారు. మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే పత్రికలపై కక్ష పూరితంగా వ్యవహరించే ప్రభుత్వాలకు ఈ తీర్పు గొడ్డలిపెట్టువంటిదని అభిప్రాయపడ్డారు. చిన్న పత్రికల్లో పని చేసే జిల్లా, నియోజక వర్గ స్థాయి జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్ (ప్రభుత్వ గుర్తింపు కార్డు) ఇవ్వకుండా దూరం పెట్టడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేయటం పట్ల మల్లెల శివ నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ - 2016 లోని షెడ్యూల్ ‘ఈ’ ని కొట్టేస్తూ తాజాగా తీర్పు ఇచ్చిందని వెల్లడించారు.చిన్న వార్తా పత్రికలను నాలుగు విభాగాలుగా విభజించడం చెల్లదని పేర్కొంది. 2016లో జీవో 239 ద్వారా అప్పటి ప్రభుత్వం పెట్టిన నిబంధనలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై తీర్పు చెప్పిందని వెల్లడించారు. ‘చిన్న పత్రికల్లో పని చేసే జర్నలిస్టులను ఏ,బీ,సీ,డీ కేటగిరీ లుగా ఎందుకు విభజించారో సరైన వివరణ లేదని, . తగిన వివరణ, సమర్థన లేకుండా మిగతా వారితో సమానంగా గుర్తింపు కార్డులు ఇవ్వక పోవడం చెల్లదని, రెండు నెలల్లో పారదర్శక, హేతుబద్ధమైన ప్రాతిపదికన మార్గదర్శకాలు రూపొందించాలని హైకోర్టు స్పష్టం చేసిందని మల్లెల వివరించారు. ’
ఇకనైనా .చిన్న పత్రికలు, పెద్ద పత్రికలంటూ పత్రికల మధ్య తారతమ్యాలు చూపుతూ చిన్న పత్రికల మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్న ప్రభుత్వాలు తెలంగాణా రాష్ట్ర హైకోర్టు తీర్పుతో బుద్ది తెచ్చుకోవాలని హితవు పలికారు.
0 comments:
Post a Comment