తీర్థప్రసాదాలు స్వీకరించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు...
చిలకలూరిపేట పట్టణంలోని బెస్తపాలెం నందు సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం శ్రీ శ్రీ శ్రీ కామమ్మ తల్లి- మారయ్య స్వామి వార్ల దేవాలయం. ప్రతి ఉగాది పండుగ నాడు తిరుణాల మహోత్సవం జరుగుతుంది ఇది 300 సంవత్సరాలుగా జరుగుతున్న ఆచారం. ఈ ఆలయ ధర్మకర్త సాప వీర రాఘవులు గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరు కావలసినదిగా శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారిని కోరగా వారి ఆహ్వానం మేరకు ఈ వేడుకకు హాజరై శ్రీ శ్రీ శ్రీ కామమ్మ తల్లి - మారయ్య స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపి, తీర్థప్రసాదాలు స్వీకరించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు...
ఈ సందర్భంగా ఆలయ కమిటీ మరియు అభిమానుల కోరిక మరియు వారి ఆచారం మేరకు సరదాగా కర్రసాము మరియు కత్తిసాము చేసి అందరిని ఉత్సాహపరిచిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు...
ఈ కార్యక్రమము లో చిలకలూరిపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాప ఆదినారాయణ గారు, అడ్వకేట్ తోట శ్రీనివాసరావు గారు, మల్లెల నాగేశ్వరరావు గారు, సాప లక్ష్మీనారాయణ గారు, ఇమ్మడి సురేంద్ర గారు తదితరులున్నారు.
0 comments:
Post a Comment